ఎవరికి ఓటేయాలన్న దానిపై ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన పవన్....
సమయం తక్కువగా ఉండడం, హఠాత్తుగా ముందస్తు రావడంతో జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతుందని మొదట్లోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే హఠాత్తుగా రెండు రోజుల క్రితం అభిమానులు, పోటీలో ఉన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ఎన్నికలపై జనసేన వైఖరిని ఐదో తేదీన వెల్లడిస్తానని పవన్ ట్వీట్ చేశారు. దీంతో ఉత్కంఠ రేగింది. పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అన్నట్టుగానే నేడు ట్వీట్టర్‌లో తన వీడియోను పవన్ […]
సమయం తక్కువగా ఉండడం, హఠాత్తుగా ముందస్తు రావడంతో జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతుందని మొదట్లోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అయితే హఠాత్తుగా రెండు రోజుల క్రితం అభిమానులు, పోటీలో ఉన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ఎన్నికలపై జనసేన వైఖరిని ఐదో తేదీన వెల్లడిస్తానని పవన్ ట్వీట్ చేశారు. దీంతో ఉత్కంఠ రేగింది. పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అన్నట్టుగానే నేడు ట్వీట్టర్‌లో తన వీడియోను పవన్ ట్వీట్ చేశారు.
ముందస్తు వల్లే జనసేన పోటీ చేయలేకపోయిందని చెప్పిన పవన్… తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే, తెలంగాణ తెచ్చామని చెప్పుకునే పార్టీల మధ్య పోరు నడుస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గందరగోళానికి గురి కాకుండా ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తక్కువ అవినీతి…. ఎక్కువ పారదర్శకతతో పాలన అందించే వారికే ఓటేయాలని పవన్ సూచించారు. ఈ అంశంపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటేయాలని పవన్ కోరారు. ఏ ఒక్క పార్టీకి ఓటేయాలని ప్రత్యేకంగా చెప్పకుండా పవన్ జాగ్రత్త పడ్డారు.