లగడపాటి వ్యూహమేంటి ?
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇవాళ తెలంగాణ ఎన్నికలపై చేసిన సర్వేను వివరించారు. మహాకూటమి వైపే తెలంగాణ ప్రజల నాడి ఉందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన జాతీయ స్థాయి ఏజెన్సీల సర్వేలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పగా…. లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి గట్టి పోటీనిస్తున్న మాట వాస్తవమే అయినా పోలింగ్ నాటికి ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా చాలా చోట్ల […]
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇవాళ తెలంగాణ ఎన్నికలపై చేసిన సర్వేను వివరించారు. మహాకూటమి వైపే తెలంగాణ ప్రజల నాడి ఉందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన జాతీయ స్థాయి ఏజెన్సీల సర్వేలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పగా…. లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని చెబుతున్నారు.
తెలంగాణలో ప్రజాకూటమి గట్టి పోటీనిస్తున్న మాట వాస్తవమే అయినా పోలింగ్ నాటికి ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా చాలా చోట్ల కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సహకరించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూటమి అభ్యర్థుల ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే విషయమై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో లగడపాటి సర్వే పేరుతో మహాకూటమిలో ఊపుతేవడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూట్రల్ ఓటర్లను మహాకూటమి వైపు మళ్లించడమే ఈ సర్వే లక్ష్యమనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థుల పేర్లలో చాలా మంది ఆయా నియోజక వర్గాల్లో వెనకబడి ఉన్నట్లు పలు సర్వేలు తెలిపాయని…. కాని లగడపాటి మాత్రం వ్యూహాత్మకంగా వారికి లబ్ది చేకూర్చడానికే ఈ సర్వే పేరుతో సంచలనం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇంతకు మునుపు ఆయన ప్రకటించిన సర్వేలు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండడంతో…. సహజంగానే ప్రజల్లో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తినే సొమ్ము చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా లబ్ది చేకూరుస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.
ఏదేమైనా ఆంధ్రా ఆక్టోపస్ ఎవరి లబ్ది కోసమైనా ఈ సర్వే చేయించారా? లేక ఆయన సర్వే నిజమా అనేది 11వ తేదీన కాని తేలదు.