అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం

బ్లూక్రాస్ అవార్డు అందుకొన్న భారత తొలి షూటర్ భారత ఆల్ టైమ్ గ్రేట్ షూటర్, బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ షూటింగ్ చరిత్రలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించిన 36 ఏళ్ల అభినవ్ బింద్రాకు…అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య అత్యున్నత పురస్కారం బ్లూ క్రాస్  అవార్డును ఇచ్చి గౌరవించింది. 2006 ప్రపంచ షూటింగ్ పోటీలతో పాటు…2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన అభినవ్ …2002, 2006, 2010, […]

Advertisement
Update:2018-12-01 13:57 IST
  • బ్లూక్రాస్ అవార్డు అందుకొన్న భారత తొలి షూటర్

భారత ఆల్ టైమ్ గ్రేట్ షూటర్, బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ షూటింగ్ చరిత్రలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించిన 36 ఏళ్ల అభినవ్ బింద్రాకు…అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య అత్యున్నత పురస్కారం బ్లూ క్రాస్ అవార్డును ఇచ్చి గౌరవించింది.

2006 ప్రపంచ షూటింగ్ పోటీలతో పాటు…2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన అభినవ్ …2002, 2006, 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్ లో సైతం స్వర్ణపతకాలు సాధించాడు.

2002, 2010 కామన్వెల్త్ గేమ్స్ లో రజత, 2006 కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకాలు సాధించిన ఘనత సైతం అభినవ్ బింద్రాకు ఉంది.

దశాబ్దకాలం పాటు షూటింగ్ క్రీడకు అభినవ్ బింద్రా చేసిన సేవలకు గుర్తింపుగా…బ్లూ క్రాస్ పురస్కారం స్వీకరించాడు. ఈ ఘనత అందుకోడం తన అదృష్టమని..అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News