రేవంత్ రెడ్డి వెంటపడుతున్న మీడియా
తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డికి మీడియా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎన్నికల వేళ మీడియాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డికే ఎక్కువగా పబ్లిసిటీ దక్కుతోంది. అందుకు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న జాగ్రత్తలు కారణం కావచ్చు, టీడీపీ బడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ మీడియా మేనేజ్ మెంట్ తెలియడం కారణం కావచ్చు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చేస్తున్న ప్రయత్నం కావొచ్చు. కారణం ఏదైనా పత్రికల్లో, […]
తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డికి మీడియా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎన్నికల వేళ మీడియాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డికే ఎక్కువగా పబ్లిసిటీ దక్కుతోంది.
అందుకు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న జాగ్రత్తలు కారణం కావచ్చు, టీడీపీ బడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ మీడియా మేనేజ్ మెంట్ తెలియడం కారణం కావచ్చు.
ఆయనకున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చేస్తున్న ప్రయత్నం కావొచ్చు. కారణం ఏదైనా పత్రికల్లో, టీవీల్లో రేవంత్ రెడ్డికి ఎనలేని ప్రాముఖ్యం దొరుకుతోంది. ప్రధాన పత్రికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారవార్త కనిపించకపోయినా రేవంత్ రెడ్డి వార్త మాత్రం తప్పనిసరిగా ప్రధాన పత్రికల్లో ఉంటోంది. టీడీపీ అనుకూల పత్రికలు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని
బాగానే కవర్ చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రత్యర్థి మీడియా సంస్థలు కూడా రేవంత్ రెడ్డికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నాయి. టీడీపీతో పెట్టుకుని వైఎస్ పావురాల గుట్టలో పావురం అయిపోయాడు… పీసు… పీసు అయిపోయాడని రేవంత్ రెడ్డి పదేపదే హేళన చేసినా సరే ఆ మాటలను మనసులో పెట్టుకోకుండా సాక్షి మీడియా కూడా రేవంత్ రెడ్డి వార్తలకు బాగానే ప్రాధాన్యత ఇస్తోంది. ఫొటోలతో సహా రేవంత్ రెడ్డి ప్రచార పర్వాన్ని ప్రచురిస్తూ తమ మీడియాకు తనామనా భేదం లేదని చాటుతోంది.
టీవీ చానళ్లు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్‌లను బాగానే చూపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నా సరే రేవంత్ రెడ్డి విషయంలో మీడియా ఇస్తున్న పబ్లిసిటీని చూసి సీనియర్లు జుట్టు పీక్కుంటున్నారు. మీడియాలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవడానికి వెనుక విజయరహస్యం ఏంటని ఆరా తీస్తున్నారు.