కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలు ఎన్నడూ లేవు.... మోడీపై వేటుకు డిమాండ్ చేసింది నేనే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ను పాతేయాలి, పూడ్చేయాలి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందించారు. పదేపదే బీజేపీతో పలుమార్లు పొత్తుపెట్టుకున్న చంద్రబాబు… ఆ పార్టీ గురించి కూడా మరోలా మాట్లాడారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని అందరూ చెబుతారు. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో తమకు ఎప్పుడూ కూడా సైద్దాంతిక విభేదాలు లేవని చెప్పారు. కాంగ్రెస్‌తో టీడీపీకి కేవలం రాజకీయపరమైన తేడాలు మాత్రమే ఉండేవని […]

Advertisement
Update:2018-11-29 09:41 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ను పాతేయాలి, పూడ్చేయాలి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందించారు. పదేపదే బీజేపీతో పలుమార్లు పొత్తుపెట్టుకున్న చంద్రబాబు… ఆ పార్టీ గురించి కూడా మరోలా మాట్లాడారు.

కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని అందరూ చెబుతారు. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో తమకు ఎప్పుడూ కూడా సైద్దాంతిక విభేదాలు లేవని చెప్పారు. కాంగ్రెస్‌తో టీడీపీకి కేవలం రాజకీయపరమైన తేడాలు మాత్రమే ఉండేవని చెప్పారు.

అదే సమయంలో బీజేపీతో తొలినుంచి టీడీపీ సైద్దాంతిక విభేదాలున్నాయని చెప్పుకొచ్చారు. గోద్రా అల్లర్లప్పుడు మోడీని సస్పెండ్ చేయాలని తొలుత డిమాండ్ చేసిన వ్యక్తిని తానేనని చంద్రబాబు చెప్పారు. కానీ మోడీలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతోనే 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు బాబు. మోడీలో మార్పు రాకపోవడం వల్లే ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

తెలంగాణకు రాహుల్, మోడీ, అమిత్ షా వస్తే లేని అభ్యంతరం తాను వస్తే మాత్రమే కేసీఆర్‌కు ఎందుకుందని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ తనను ఎంతగా దూషించినా తాను మాత్రం తిరిగి కేసీఆర్‌ను దూషించబోనని చంద్రబాబు చెప్పారు. తమ విధానాలను మాత్రమే ప్రజలకు వివరిస్తానన్నారు. తెలంగాణ అభివృద్ది చెందాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News