ప్రపంచ హాకీలో భారత్ శుభారంభం

గ్రూప్ – సీ తొలిరౌండ్లో సౌతాఫ్రికాపై భారత్ 5-0 విజయం సిమ్రన్ జీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన హాకీ ప్రపంచకప్ గ్రూప్- సీ లీగ్ లో…మాజీ చాంపియన్, ఆతిథ్య భారత్ తొలివిజయంతో శుభారంభం చేసింది. 15వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ముగిసిన పోటీలో 5వ ర్యాంకర్ భారత్ 5-0 గోల్స్ తో విజేతగా నిలిచింది. ఆట తొలి నిముషం నుంచే భారత్ ఆధిపత్యంతో సాగిన ఈపోటీ […]

Advertisement
Update:2018-11-29 09:30 IST
  • గ్రూప్ – సీ తొలిరౌండ్లో సౌతాఫ్రికాపై భారత్ 5-0 విజయం
  • సిమ్రన్ జీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన హాకీ ప్రపంచకప్ గ్రూప్- సీ లీగ్ లో…మాజీ చాంపియన్, ఆతిథ్య భారత్ తొలివిజయంతో శుభారంభం చేసింది.

15వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ముగిసిన పోటీలో 5వ ర్యాంకర్ భారత్ 5-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.

ఆట తొలి నిముషం నుంచే భారత్ ఆధిపత్యంతో సాగిన ఈపోటీ తొలి క్వార్టర్ 10వ నిముషంలోేనే భారత్ తొలిగోల్ సాధించింది. మన్ దీప్ సింగ్ తొలిగోల్ అందించగా…. 12వ నిముషంలో ఆకాశ్ దీప్ సింగ్..ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆట 3వ క్వార్టర్ … 43, 46 నిముషాలలో సిమ్రన్ జీత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ గోల్స్ సాధించడంతో ఆధిక్యం 4-0కు పెరిగింది.

ఆట 45వ నిముషంలో లలిత్ ఉపాధ్యాయ గోల్ అందించాడు. మొత్తం మీద…ఆట నాలుగు క్వార్టర్లూ…భారత్ షోగానే సాగింది. సిమ్రన్ జీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆదివారం జరిగే రెండో రౌండ్ పోటీలో ప్రపంచ 3వ ర్యాంకర్ బెల్జియంతో భారత్ తలపడనుంది. గ్రూప్ – సీ ఇతర ప్రత్యర్థి జట్లలో కెనడా సైతం ఉంది.

Tags:    
Advertisement

Similar News