క్రిస్టియానో రొనాల్డో అరుదైన రికార్డు

100 చాంపియన్స్ లీగ్ విజయాల రొనాల్డో 2018 సీజన్లో యువెంటస్ క్లబ్ ఆటగాడిగా రొనాల్డో ప్రపంచ సాకర్ లో రికార్డుల మొనగాడు, యూరోపియన్ సాకర్ బుల్లెట్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత దక్కించుకొన్నాడు. స్పానిష్, బ్రిటీష్, ఇటాలియన్ క్లబ్ జట్లలో సభ్యుడిగా…. చాంపియన్స్ లీగ్ లో పాల్గొన్న క్రిస్టియానో రొనాల్డో..100 విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సీజన్ నుంచి ఇటాలియన్ క్లబ్ యువెంటస్ తరపున ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో…వాలెన్షియా క్లబ్ తో […]

Advertisement
Update:2018-11-29 12:20 IST
  • 100 చాంపియన్స్ లీగ్ విజయాల రొనాల్డో
  • 2018 సీజన్లో యువెంటస్ క్లబ్ ఆటగాడిగా రొనాల్డో

ప్రపంచ సాకర్ లో రికార్డుల మొనగాడు, యూరోపియన్ సాకర్ బుల్లెట్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత దక్కించుకొన్నాడు. స్పానిష్, బ్రిటీష్, ఇటాలియన్ క్లబ్ జట్లలో సభ్యుడిగా…. చాంపియన్స్ లీగ్ లో పాల్గొన్న క్రిస్టియానో రొనాల్డో..100 విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

ప్రస్తుత సీజన్ నుంచి ఇటాలియన్ క్లబ్ యువెంటస్ తరపున ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో…వాలెన్షియా క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో యువెంటస్ క్లబ్ విజయం సాధించడం ద్వారా…. నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

2018 చాంపియన్స్ లీగ్ నాకౌట్ రౌండ్ చేరిన జట్లలో యువెంటస్ తో పాటు రియల్ మాడ్రిడ్, బైరన్ మ్యూనిచ్, రోమా, అజాక్స్ ఉన్నాయి.

గత ఏడాది వరకూ స్పానిష్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు తరపున ఆడిన క్రిస్టియానో రొనాల్డో …ప్రస్తుత సీజన్లో ఇటాలియన్ క్లబ్ యువెంటస్ కు బదిలీ అయ్యాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్స్ సాధించిన క్రిస్టియానో…ఇప్పుడు యువెంటస్ క్లబ్ ఆటగాడిగా ఆరో టైటిల్ కు గురిపెట్టాడు.

ఆరు చాంపియన్స్ లీగ్ టైటిల్స్ సాధించిన తొలి పోర్చుగీసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని కలలు కంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News