ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అవినీతిపై హైకోర్టులో పిల్‌

ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 108 అంబులెన్స్‌ల నిర్వహణ నుంచి ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు వరకు వందలకోట్ల మేర అవినీతి జరుగుతోందని కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వైద్య పరికరాల కొనుగోళ్లలో జరిగిన భారీ కుంభకోణం పై ఏసీబీ విచారణ జరుపుతోంది. తాజాగా ఆరోగ్యశాఖలో అవినీతిపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. బడి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన బాలస్వస్థ పథకంలో కుంభకోణం జరిగిందంటూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ […]

Advertisement
Update:2018-11-29 15:40 IST

ఏపీ వైద్యారోగ్య శాఖ ఆవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 108 అంబులెన్స్‌ల నిర్వహణ నుంచి ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు వరకు వందలకోట్ల మేర అవినీతి జరుగుతోందని కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే వైద్య పరికరాల కొనుగోళ్లలో జరిగిన భారీ కుంభకోణం పై ఏసీబీ విచారణ జరుపుతోంది. తాజాగా ఆరోగ్యశాఖలో అవినీతిపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

బడి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన బాలస్వస్థ పథకంలో కుంభకోణం జరిగిందంటూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ కుంభకోణం 370 కోట్ల రూపాయలకు సంబంధించినది. నకిలీ పత్రాలతో ధనుష్ సంస్థ 370 కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకుందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ పత్రాలకు సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా కమిషనర్ పూనం మాలకొండయ్య, ధనుష్‌ సంస్థలను ఆదేశించింది.

ఏపీ ఆరోగ్య శాఖలో ఇప్పటికే అనేక భారీకుంభకోణాలు జరిగాయి… క్లుప్తంగా…..

బాలస్వస్థ పథకం టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ప్రస్తుతం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇంతకంటే పెద్దపెద్ద వ్యవహారాలే ఆరోగ్య శాఖలో నడుస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే వైద్య పరికరాల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం జరిగిన తీరు చూసి దర్యాప్తు సంస్థలే కంగుతిన్నాయి.

షుగర్ పరీక్షించేందుకు వాడే గ్లూకో మీటర్ బయట రూ. వెయ్యి రూపాయలకు దొరుకుతుంటే. ఆన్ లైన్ లో 500 లకే దొరుకుతుంది. ఏపీ ఆరోగ్య శాఖ మాత్రం ఏకంగా గ్లూకో మీటర్ ధర రూ. 5.8 లక్షలుగా చూపించింది.

ప్రైవేట్ ల్యాబ్‌ల నుంచి వచ్చే కమిషన్లకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది కొందరు ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలను కావాలని పాడు చేస్తుండడంతో.. వాటి నిర్వాహణను ఒక ప్రైవేట్ సంస్థకు 2015లో ఇదే ప్రభుత్వం అప్పగించింది. సదరు ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ పెద్దలు కలిసి కుంభకోణానికి తెరలేపారు. పరికరాల నిర్వాహణ కింద ఏదైనా పరికరం ఖరీదులో 7.4 శాతం సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఇక్కడే తెలివితేటలు ప్రదర్శించారు. గ్లూకో మీటర్‌ నిర్వాహణకు నెలకు మహా అయితే 100 నుంచి రెండు వందలు చెల్లించాలి. కానీ గ్లూకో మీటర్ ఖరీదును ఏకంగా రూ. 5.8 లక్షలుగా చూపించి.. అందులో 7.14 శాతం సొమ్మును నిర్వాహణ కింద నెలనెల తీసుకుంటోంది ప్రైవేట్ సంస్థ.

ఇలా ఒక్కో గ్లూకో మీటర్‌కు నెలకు 38వేల రూపాయలను కేవలం పరికరం నిర్వాహణ కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్క గ్లూకో మీటరే కాదు. ప్రతి పరికరం ధరను ఇలా వందల రెట్లు పెంచి చూపింది.. ఆ ధరలో 7.14 శాతం సొమ్మును నెలనెల నిర్వాహణ ఖర్చు కింద స్వాహా చేస్తున్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కోటి 69 లక్షల విలువైన ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రం ధరను ఏకంగా 3కోట్ల 50లక్షలుగా చూపించి దోపిడి చేస్తున్నారు. ఇలా ప్రభుత్వాస్పత్రుల్లో యంత్రాల నిర్వాహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేట్ సంస్థ ప్రతి నెలా మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దల సాయంతో కాజేస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది.

Tags:    
Advertisement

Similar News