ఎన్‌ఐఏ విచారణ కోరుతూ ఆర్కే పిటిషన్
వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంపై పిటిషన్ల విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తనపై జరిగిన హత్యాయత్నం కుట్రను చేధించేందుకు ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని థర్డ్ పార్టీ చేత విచారణ జరిగిపించాలని ఇది వరకే జగన్ కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా నేడు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ వేశారు. జగన్‌పై దాడి కేసు విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్‌ఐఏకు అప్పగించాలని కోరుతూ ఆర్కే హైకోర్టులో […]
వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంపై పిటిషన్ల విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
తనపై జరిగిన హత్యాయత్నం కుట్రను చేధించేందుకు ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని థర్డ్ పార్టీ చేత విచారణ జరిగిపించాలని ఇది వరకే జగన్ కోర్టులో పిటిషన్ వేశారు.
తాజాగా నేడు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ వేశారు. జగన్‌పై దాడి కేసు విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్‌ఐఏకు అప్పగించాలని కోరుతూ ఆర్కే హైకోర్టులో పిటిషన్ వేశారు.
తక్షణం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదలాయించాలని కూడా కోర్టును ఆర్కే కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు… జగన్‌పై హత్యాయత్నం కేసులో దాఖలైన అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ జరుపుతామని వెల్లడించింది.