సినిమాలు తీసే టైంలోనే నాకు కవరేజ్‌ ఇచ్చేవారు కాదు " పవన్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మరోసారి వైసీపీ, టీడీపీపై ఫైర్ అయ్యారు. తనపై ఇష్టమొచ్చినట్టు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. కొందరు తనను సంప్రదించకుండానే వారికి తోచినట్టు కథనాలు రాస్తున్నారని పవన్‌ విమర్శించారు. తనకు టీవీ చానల్‌, పేపర్‌ లేవన్నారు. తనకు సినిమాలు చేసే సమయంలోనే పెద్దగా కవరేజ్‌ ఇచ్చేవారు కాదన్నారు. పవన్‌కు కవరేజ్‌ ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే అలా చేసి ఉండవచ్చన్నారు. తాను నియోజకవర్గానికి వంద మందినేతలను తయారు చేయగలనన్నారు. చంద్రబాబు కార్యాలయంలో కూడా తన అభిమానులు […]

Advertisement
Update:2018-11-28 03:31 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మరోసారి వైసీపీ, టీడీపీపై ఫైర్ అయ్యారు. తనపై ఇష్టమొచ్చినట్టు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. కొందరు తనను సంప్రదించకుండానే వారికి తోచినట్టు కథనాలు రాస్తున్నారని పవన్‌ విమర్శించారు.

తనకు టీవీ చానల్‌, పేపర్‌ లేవన్నారు. తనకు సినిమాలు చేసే సమయంలోనే పెద్దగా కవరేజ్‌ ఇచ్చేవారు కాదన్నారు. పవన్‌కు కవరేజ్‌ ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే అలా చేసి ఉండవచ్చన్నారు.

తాను నియోజకవర్గానికి వంద మందినేతలను తయారు చేయగలనన్నారు. చంద్రబాబు కార్యాలయంలో కూడా తన అభిమానులు ఉన్నారని పవన్ చెప్పుకున్నారు.

జనసేన ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని…. కాబట్టి వారు ఒకసారి తమ ఓటును సరిచూసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకుడు కాదని…. ఒక రాజకీయవేత్త మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఏమో హెరిటేజ్ సంస్థ పెట్టుకోవచ్చు… జగన్‌ భారతీ సిమెంట్‌ను స్థాపించవచ్చు… పవన్‌ కల్యాణ్ మాత్రం రోడ్డు మీద అడుక్కు తినాలా అని ప్రశ్నించారు.

అధికారం కోసం తాను రాలేదు కాబట్టే ఓటమికి భయపడడం లేదన్నారు. 25 ఏళ్ల పాటు పోరాటం చేసేందుకు సిద్ధపడే వచ్చానన్నారు. తాను అత్యంత ప్రభావశీల నాయకులను తయారు చేయాలనుకుంటున్నానని… అలాంటి వారిని తయారు చేయడానికి 25 ఏళ్లు పడుతుందని పవన్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News