టీడీపీ, జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి టీఆర్‌ఎస్‌ను ఓడించండి

పవన్‌ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తోందని, టీడీపీకి మంచి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని ఆరోపణలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రాహుల్‌ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన చంద్రబాబు… జనసేన కార్యకర్తలకు టీడీపీతో కలిసి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని…. ఈ కొద్దిరోజులు టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని […]

Advertisement
Update:2018-11-28 12:10 IST

పవన్‌ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తోందని, టీడీపీకి మంచి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని ఆరోపణలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మంలో రాహుల్‌ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన చంద్రబాబు… జనసేన కార్యకర్తలకు టీడీపీతో కలిసి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని…. ఈ కొద్దిరోజులు టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తొలుత జనసేన కార్యకర్తలు అన్న చంద్రబాబు రెండోసారి కూడా తెలంగాణ జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి మహాకూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో విడిపోయామని చెబుతున్న జనసేనను… తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిందిగా చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News