లోకేష్‌ శాఖలో భారీగా రహస్య జీవోలు

ఏపీలో రహస్య జీవోల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాదిగా రహస్య జీవోలు జారీ అవుతూనే ఉన్నాయి. వీటిలో అనేకం ఆర్థిక అంశాలు, నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్న వ్యవహారాలకు సంబంధించినవి గానే చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో ఒకే రోజు భారీగా రహస్య జీవోలు వెలువడ్డాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకంగా 36 జీవోలను వరుసగా జారీ చేశారు. […]

Advertisement
Update:2018-11-27 02:37 IST

ఏపీలో రహస్య జీవోల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాదిగా రహస్య జీవోలు జారీ అవుతూనే ఉన్నాయి. వీటిలో అనేకం ఆర్థిక అంశాలు, నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్న వ్యవహారాలకు సంబంధించినవి గానే చెబుతున్నారు.

ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో ఒకే రోజు భారీగా రహస్య జీవోలు వెలువడ్డాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకంగా 36 జీవోలను వరుసగా జారీ చేశారు. వాటిలో కేవలం మూడు జీవోల సమాచారం మాత్రమే బహిరంగంగా ఉంది.

మిగిలిన 33 జీవోలను రహస్యంగానే ఉంచారు. వీటిలో అనేకం ప్రజాధనాన్ని దోచిపెట్టే జీవోలేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా విచ్చలవిడిగా జీవోలను రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News