బాల సాయిబాబా హఠాన్మరణం

కర్నూలు జిల్లాకు చెందిన బాల సాయిబాబా హఠాత్తుగా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో బాల సాయిబాబా ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న ఆయన ఆశ్రమంలో నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. బాల సాయిబాబా వయసు 58 ఏళ్లు. కర్నూలు జిల్లాకు చెందిన బాల సాయిబాబా… శివరాత్రి రోజు నోటి నుంచి శివలింగం […]

Advertisement
Update:2018-11-27 06:35 IST

కర్నూలు జిల్లాకు చెందిన బాల సాయిబాబా హఠాత్తుగా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో బాల సాయిబాబా ప్రాణాలు విడిచారు.

హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న ఆయన ఆశ్రమంలో నిన్న రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

బాల సాయిబాబా వయసు 58 ఏళ్లు. కర్నూలు జిల్లాకు చెందిన బాల సాయిబాబా… శివరాత్రి రోజు నోటి నుంచి శివలింగం తీయడం ద్వారా ప్రత్యేకతను చాటుకుంటూ భక్తులకు దగ్గరయ్యారు.

ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు శివారులో ఆయనకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఆశ్రమం ఉంది. బాల సాయిబాబాపై పలు ఆస్తి వివాదాలు, చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News