రూటు మార్చిన జేడీ.... లోక్‌సత్తా అధినేతగా బాధ్యతలు

కొత్తపార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రూటు మార్చారు. ఆయన లోక్‌సత్తా పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. లోక్‌సత్తా పార్టీని జయప్రకాశ్‌ నారాయణ నడుపుతూ వచ్చారు. 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. ఈనేపథ్యంలో లక్ష్మీనారాయణ తనకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టిన జేడీ అక్షరాలు వచ్చే ‘జనధ్వని’ పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కానీ జయప్రకాశ్‌ నారాయణ జరిపిన సంప్రదింపుల తర్వాత లక్ష్మీ నారాయణ మనసు మార్చుకున్నారు. […]

Advertisement
Update:2018-11-26 02:50 IST

కొత్తపార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రూటు మార్చారు. ఆయన లోక్‌సత్తా పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. లోక్‌సత్తా పార్టీని జయప్రకాశ్‌ నారాయణ నడుపుతూ వచ్చారు.

2014 ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. ఈనేపథ్యంలో లక్ష్మీనారాయణ తనకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టిన జేడీ అక్షరాలు వచ్చే ‘జనధ్వని’ పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కానీ జయప్రకాశ్‌ నారాయణ జరిపిన సంప్రదింపుల తర్వాత లక్ష్మీ నారాయణ మనసు మార్చుకున్నారు.

కొత్తగా పార్టీ పెట్టకుండా లోక్‌సత్తాలో చేరుతున్నారు. ఆయనకు లోక్‌సత్తా అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు జయప్రకాశ్‌ నారాయణ అంగీకరించారు. ఇద్దరి భావజాలం ఒకటే కాబట్టి…. కొత్త పార్టీ లేకుండా లోక్‌సత్తాలోకే రావాలని జేపీ ఆహ్వానించారు.

మాజీ జేడీ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటే…. జేపీ సలహాలు, సంప్రదింపుల బాధ్యత స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. కొత్త తరహా రాజకీయం చేస్తానన్న లక్ష్మీనారాయణ ఇప్పుడు జేపీతో కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది .

పవన్‌ కల్యాణ్…. కేంద్రం, రాష్ట్రం మధ్య నిధుల లెక్కలు తేల్చేందుకు జేఎఫ్‌సీని ఏర్పాటు చేయగా అందులో జేపీ కూడా ఉన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిందే అని జేఎఫ్‌సీలోని మిగిలిన సభ్యులు అభిప్రాయపడగా… జయప్రకాశ్‌ నారాయణ మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని వాదించారు.

Tags:    
Advertisement

Similar News