రాసలీలలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ

అమరావతిలోని మంగళగిరి తొమ్మిదో బెటాలియన్ డీఎస్పీ పగడాల నాగ దుర్గా ప్రసాద్‌…. రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మహిళ భర్త, బంధువులు, పోలీసులు కలిసి డీఎస్పీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ భార్య ధనలక్ష్మి వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో ఒక స్నేహితురాలి ద్వారా డీఎస్పీ నాగ దుర్గ ప్రసాద్‌ పరిచయం పెంచుకున్నారు. అలా […]

Advertisement
Update:2018-11-26 07:36 IST

అమరావతిలోని మంగళగిరి తొమ్మిదో బెటాలియన్ డీఎస్పీ పగడాల నాగ దుర్గా ప్రసాద్‌…. రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

మహిళ భర్త, బంధువులు, పోలీసులు కలిసి డీఎస్పీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రసాద్ భార్య ధనలక్ష్మి వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో ఒక స్నేహితురాలి ద్వారా డీఎస్పీ నాగ దుర్గ ప్రసాద్‌ పరిచయం పెంచుకున్నారు. అలా ధనలక్ష్మి కుటుంబానికి కూడా దగ్గరయ్యారు. 50 ఏళ్ల నాగ దుర్గా ప్రసాద్ తొలుత ధనలక్ష్మిని తన కూతురులాంటిదంటూ ఇంటికి వెళ్లేవాడు. ఆమె భర్తతోనూ మాట్లాడేవాడు.

వారి ఆర్థిక ఇబ్బందులను గమనించిన డీఎస్పీ… ధనలక్ష్మికి టీటీడీలోగానీ, హోంగార్డుగా గానీ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకు కాపురం తిరుపతికి మార్చాలని సూచించారు. అతడి మాటలు నమ్మిన ధనలక్ష్మి భర్త డీఎస్పీ చెప్పినట్టే కాపురం తిరుపతికి మార్చారు.

బాధితుడు ప్రసాద్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించేవాడు. అయితే కొద్దిరోజులకు ధనలక్ష్మి తిరుపతిలో తన భర్త ఉంచిన అద్దె ఇంటిని ఖాళీ చేసి… డీఎస్పీ నాగ దుర్గా ప్రసాద్ చూసిన ఒక అపార్ట్‌మెంట్‌లోకి కాపురం మార్చింది.

ఈ విషయం తెలుసుకున్న ధనలక్ష్మి తమ్ముడు అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా అప్పటికే డీఎస్పీ, ఆమె ఇద్దరూ సరసాల్లో మునిగితేలుతున్నారు. దాన్ని చూసిన ధనలక్ష్మి తమ్ముడు ఆమెను కొట్టి మందలించాడు.

తమ్ముడు కొడితే… ధనలక్ష్మి మాత్రం వెళ్లి భర్త ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ నాగ దుర్గా ప్రసాద్‌ కూడా హైదరాబాద్ వెళ్లి ప్రసాద్‌ను తీవ్రంగా కొట్టివచ్చాడు.

డీఎస్పీ పగడాల నాగ దుర్గా ప్రసాద్‌

తనకు ధనలక్ష్మి మధ్య అక్రమసంబంధం హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ఉందని చెబుతూ కొన్ని ఆడియో టేపులను కూడా భర్త ప్రసాద్‌కు పంపించాడు డీఎస్పీ. ఆ ఆడియో టేపులను తీసుకుని తిరుపతి ఎస్పీకి బాధితుడు ప్రసాద్ ఫిర్యాదు చేశాడు

అప్పటి నుంచి పోలీసులు డీఎస్పీపై ఎస్పీ ఆదేశాల మేరకు నిఘా ఉంచారు. భర్త ప్రసాద్ కూడా అవకాశం కోసం ఎదురుచూశాడు. అపార్ట్‌మెంట్లో డీఎస్పీ, తన భార్య ధనలక్ష్మి ఏకాంతంగా ఉన్నారని తెలుసుకున్న ప్రసాద్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే రైడ్‌ చేసిన పోలీసులు డీఎస్పీని, ధనలక్ష్మిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులను చూడగానే డీఎస్పీ వారిని దబాయిస్తూ తోసుకుని కారులో పారిపోయాడు.

వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని, కాబట్టి తనను ఏమీ చేయలేరంటూ వెళ్లిపోయాడు. భర్త ఫిర్యాదు మేరకు భార్య ధనలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కూడా పోలీసుల ముందు లొంగిపోయారు.

Tags:    
Advertisement

Similar News