చంద్రబాబు ముందు పుట్టాడా? మేకలు ముందు పుట్టాయా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక మెంటల్ కేసు అని వ్యాఖ్యానించారు. మెంటల్ కేసు చంద్రబాబు హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకుంటున్నారని…. హైదరాబాద్‌ను చంద్రబాబు కట్టి ఉంటే కులికుతుబ్‌షా ఆత్మ ఆత్మహత్య చేసుకోవాలా అని ప్రశ్నించారు. చార్మినార్ కూడా చంద్రబాబే కట్టారా అని ఎద్దేవా చేశారు. 400 ఏళ్ల క్రితం కులికుతుబ్‌షా భగవంతుడిని ప్రార్థించి హైదరాబాద్ నగర నిర్మాణం మొదలుపెట్టారన్నారు. ”కులికుతుబ్‌షా ఎప్పుడు పుట్టిండు…చంద్రబాబు ఎప్పుడు పుట్టిండు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక మెంటల్ కేసు అని వ్యాఖ్యానించారు.
మెంటల్ కేసు చంద్రబాబు హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకుంటున్నారని…. హైదరాబాద్‌ను చంద్రబాబు కట్టి ఉంటే కులికుతుబ్‌షా ఆత్మ ఆత్మహత్య చేసుకోవాలా అని ప్రశ్నించారు.
చార్మినార్ కూడా చంద్రబాబే కట్టారా అని ఎద్దేవా చేశారు. 400 ఏళ్ల క్రితం కులికుతుబ్‌షా భగవంతుడిని ప్రార్థించి హైదరాబాద్ నగర నిర్మాణం మొదలుపెట్టారన్నారు. ”కులికుతుబ్‌షా ఎప్పుడు పుట్టిండు…చంద్రబాబు ఎప్పుడు పుట్టిండు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబును మెంటల్ కేసు అనడానికి మరో కారణం కూడా ఉందన్నారు. గతంలో అడవులను అభివృద్ది చేయడం ఎలా అన్న చర్చ వస్తే… మేకలను బ్యాన్ చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు.
మెంటల్ కేసు కాకుంటే…. సృష్టిలో భాగంగా వచ్చిన మేకలను నిషేధించే అధికారం చంద్రబాబుకు ఎక్కడిదని కేసీఆర్ ప్రశ్నించారు. మేక ఎప్పుడు పుట్టింది… చంద్రబాబు ఎప్పుడు పుట్టాడు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కంటే ముందు నుంచే మేకలున్నాయన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానంటున్న సిపాయి చంద్రబాబు…. మరి నాలుగున్నరేళ్లలో అమరావతిలో ఒక్క భవనం కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
గ్రాఫిక్స్ బొమ్మలు చూపెట్టడం తప్ప అమరావతిలో ఒక భవనమైనా కట్టారా అని నిలదీశారు. చంద్రబాబులాంటి మోసగాళ్లు వస్తుంటారని ప్రజలే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.