గ్రేటర్ నేతలకు కొత్త టెన్షన్ !
తెలంగాణలోని అన్ని పార్టీల నేతలకు ఇప్పుడు ఓ టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులు ప్రచారం చేస్తున్నాం. కానీ పోలింగ్ రోజు ఏమవుతుందో అనే టెన్షన్ లో ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు ఓ కొత్త భయం వాళ్ళను వెంటాడుతోందట. గ్రేటర్ హైదరాబాద్‌లోని నేతలకు ఈ టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ డిసెంబర్7న జరగబోతుంది. అంటే శుక్రవారం. పోలింగ్ డే కాబట్టి హాలిడే కామన్. కానీ ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్. శని, […]
తెలంగాణలోని అన్ని పార్టీల నేతలకు ఇప్పుడు ఓ టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులు ప్రచారం చేస్తున్నాం. కానీ పోలింగ్ రోజు ఏమవుతుందో అనే టెన్షన్ లో ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు ఓ కొత్త భయం వాళ్ళను వెంటాడుతోందట. గ్రేటర్ హైదరాబాద్‌లోని నేతలకు ఈ టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంది.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ డిసెంబర్7న జరగబోతుంది. అంటే శుక్రవారం. పోలింగ్ డే కాబట్టి హాలిడే కామన్. కానీ ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్. శని, ఆదివారంతో పాటు శుక్రవారం సెలవు రోజులు. మూడు రోజులు సెలవులు వస్తే ఇక గ్రేటర్ హైదరాబాద్ జనాలు ఉంటారా? ఉండనే ఉండరు. లాంగ్ వీకెండ్‌తో జనాలు హాలిడే మూడ్‌కు క్యూ కట్టే పరిస్థితి కన్పిస్తోంది.
మరోవైపు డిసెంబర్ 7 శుక్రవారం, తర్వాత రోజు శని, ఆది, ఇక సోమవారం సెలవు పెడితే మంగళవారం మరో హాలిడే..! అదే రోజు ఎన్నికల ఫలితాలు కావడంతో… సెలవు ప్రకటించారు. లాంగ్ వీకెండ్‌కి ఓటర్లు ఏం చేస్తారు..? సెలవులు వచ్చాయని బ్యాగులు సర్దేస్తారా..? నగరం నుంచి ఎగిరిపోతారా..? లేక బాధ్యతాయుతమైన పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకుంటారా..? తెలంగాణ పోలింగ్ రోజు దేశానికి భవిష్యత్ అయిన యూత్… దారెటు..? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లే. ముఖ్యంగా యువకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లుంటారు. ఇలా వరుస సెలవులు వస్తే.. సొంతూరికో లేక మరో ట్రిప్‌కో వెళ్ళిపోవడం ప్రతి వీకెండ్‌లోనూ జరుగుతోంది.
మరీ ఇప్పుడు కూడా ఓటర్లు ఇలా చెక్కేస్తే…. తమ పరిస్థితి ఏంటనీ నాయకులు తెగ వర్రీ అయిపోతున్నారట. ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచాలి అని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది. మరి హైదరాబాదీ ఓటర్లు ఏం చేస్తారన్నది తెలియాలి..? పోలింగ్ సెంటర్లకు క్యూ కడతారా..? బ్యాగులు సర్దేసుకొని నగరం నుంచి వెళ్ళిపోతారా? అనేది చూడాలి.