అనంతలో సాక్షి ఛానల్ పై నిషేధం.... వారి నుంచి నో రియాక్షన్

అనంతపురం పట్టణంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. స్థానిక కేబుల్‌ వ్యవస్థ టీడీపీ నేతల చేతుల్లో ఉండడంతో సాక్షి ప్రసారాలను నిలిపివేసినట్టు చెబుతున్నారు. 10 రోజులుగా అనంతపురం పట్టణంలో సాక్షి టీవీపై నిషేధం విధించారు. తొలుత సాంకేతిక కారణాలతో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయని కస్టమర్లకు చెప్పారు. కానీ కొందరు కస్టమర్లు గట్టిగా నిలదీడయంతో టీడీపీ నేతల ఆదేశాల మేరకు ప్రసారాలు ఆపేసినట్టు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరే సాక్షి టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించారని […]

Advertisement
Update:2018-11-25 05:36 IST

అనంతపురం పట్టణంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. స్థానిక కేబుల్‌ వ్యవస్థ టీడీపీ నేతల చేతుల్లో ఉండడంతో సాక్షి ప్రసారాలను నిలిపివేసినట్టు చెబుతున్నారు. 10 రోజులుగా అనంతపురం పట్టణంలో సాక్షి టీవీపై నిషేధం విధించారు.

తొలుత సాంకేతిక కారణాలతో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయని కస్టమర్లకు చెప్పారు. కానీ కొందరు కస్టమర్లు గట్టిగా నిలదీడయంతో టీడీపీ నేతల ఆదేశాల మేరకు ప్రసారాలు ఆపేసినట్టు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరే సాక్షి టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించారని వైసీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. టీడీపీ అక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయన్న కుట్రతోనే ఈపనిచేశారని ఆరోపించారు.

స్పందన లేని సాక్షి మేనేజ్‌మెంట్‌

10 రోజులుగా అనంతపురం పట్టణంలో సాక్షి ప్రసారాలు ఆగిపోవడంతో పలువురు ఈ విషయాన్ని సాక్షి ఉన్నతోద్యోగుల దృష్టికి, మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ వారి నుంచి కనీస స్పందన లేకపోవడం చూసి వైసీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు.

గతంలో రెండు టీవీ చానళ్లను కేసీఆర్ నిషేధిస్తే సదరు మీడియా సంస్థలు జర్నలిస్ట్‌ సంఘాలతో పాటు వెళ్లి ధర్నాలు చేశాయని…. కానీ సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోయాయని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్టు ఉన్నారని వాపోతున్నారు.

పది రోజులుగా సాక్షిపై అనంతపురంలో టీడీపీ నేతలు నిషేధం విధించినా కనీసం ఆ విషయాన్ని సొంత పత్రికలో కూడా రాయించుకోలేని స్థితిలో సాక్షి మేనేజ్‌మెంట్‌ ఉండడం చూస్తే ఆశ్చర్యంగా ఉందని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News