డీజీపీ గుర్తుంచుకోండి.... అశాంతి మొదలైతే ఆపడం ఎవరి తరం కాదు " పవన్ వార్నింగ్
జనసేన నాయకులపై దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బహిరంగ సభకు వచ్చిన సమయంలో తన సెక్యూరిటీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టిందన్నారు. ఆ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. మళ్ళీ హైదరాబాద్‌లో ఇంటికి వెళ్తున్న నాదెండ్ల మనోహర్ కారును ఒక ఇసుక లారీ ఢీ కొట్టిందన్నారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రెండు ఇసుక లారీలు ఢీకొట్టాయని చెప్పారు. […]
జనసేన నాయకులపై దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో తాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బహిరంగ సభకు వచ్చిన సమయంలో తన సెక్యూరిటీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టిందన్నారు. ఆ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. మళ్ళీ హైదరాబాద్‌లో ఇంటికి వెళ్తున్న నాదెండ్ల మనోహర్ కారును ఒక ఇసుక లారీ ఢీ కొట్టిందన్నారు.
కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రెండు ఇసుక లారీలు ఢీకొట్టాయని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే సరేనని… ఒకవేళ కుట్ర పూరితంగా ఇలాంటి దాడులు చేస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకునే వాడిని కాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
నాదెండ్ల మనోహర్‌కు భద్రత కల్పించాలని నెల క్రితమే డీజీపీని కోరానని…. కానీ… ఇప్పటికీ భద్రత కల్పించలేదన్నారు. ప్రత్యర్థులను ఇసుక లారీలతో తొక్కించేద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకోబోనని పవన్ చెప్పారు.
ఒకసారి అశాంతి మొదలైతే ఆపడం ఎవరి తరం కాదన్న విషయాన్ని డీజీపి గుర్తుంచుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రత్యర్థులపై దాడులు చేయించే కుతంత్రాలకు లోకేష్ దూరంగా ఉంటే మంచిదని పవన్ సూచించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అవినీతి కోటలను బద్ధలు కొట్టి తీరుతామని పవన్ ప్రకటించారు.