ఈసారి ఈ మంత్రి గెలుపు తేలికేం కాదట....

గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో వార్ వన్ సైడ్‌ అయినా ఈసారి గెలువడం మాత్రం అంత తేలికగా కన్పించడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తెలిసిపోయింది. దీంతో అభ్యర్థుల బలాబలాలపై చర్చ సాగుతోంది. ఏ సామాజిక వర్గం ఎటువైపు…. ఎవరు గెలుస్తారు…. అనేది జిల్లాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ముందు నుంచి ఊహించినవారే. మహాకూటమి అభ్యర్థి […]

Advertisement
Update:2018-11-24 09:46 IST

గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో వార్ వన్ సైడ్‌ అయినా ఈసారి గెలువడం మాత్రం అంత తేలికగా కన్పించడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తెలిసిపోయింది. దీంతో అభ్యర్థుల బలాబలాలపై చర్చ సాగుతోంది. ఏ సామాజిక వర్గం ఎటువైపు…. ఎవరు గెలుస్తారు…. అనేది జిల్లాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ముందు నుంచి ఊహించినవారే. మహాకూటమి అభ్యర్థి మాత్రం అనూహ్యంగా ఖరారు కావడంతో ఆదిలాబాద్ రాజకీయం రసవత్తరంగా మారింది.

టీఆర్ఎస్ నుంచి జోగు రామన్న ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించి అదే ఊపులో మరోమారు విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయనకు అధికార పార్టీ సంక్షేమ పథకాలు, సొంత సామాజిక వర్గం అండగా ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ గ్రామాల్లో మంత్రిని నిలదీస్తున్న తీరు చూశాక…. ఈసారి గెలుపు అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది.

కాగా గత ఎన్నికల్లో గట్టిపోటీనిచ్చిన బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన గెలుపుకు కలిసొచ్చే అవకాశాలపై ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సుజాత తన సామాజిక వర్గం ఓట్లతోపాటు రాంచంద్రారెడ్డి, భార్గవ్ దేశ్ పాండేలు మద్దతుగా నిలువడంతోపాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టేక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 14మంది పోటీలో ఉన్నా ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే ఉత్కంఠ పోటీ నెలకొంది.

జిల్లాలో ఉన్న బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ రిజర్వ్ స్థానాల్లో గెలుపుపై అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరి సామాజిక ఓట్లపై వారు గంపెడాశలు పెట్టుకున్నట్టు కనిపిస్తొంది. బోథ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆశిస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఆదివాసీల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. చివరి వరకు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఆశించిన అనిల్ జాదవ్ తన సామాజిక వర్గం ఓట్లతోపాటు సానుభూతి కలిసి వస్తుందని ధీమాతో ఉన్నారు. ఖానాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్, బీఎస్పీ అభ్యర్థి హరినాయక్, కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

గత ఎన్నికల్లో ఉద్యమ గాలితో గెలుపొందిన గులాబీ పార్టీని ఢీకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఊపు మీదున్నాయి. ఒక్క ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీ టీఆర్ఎస్ పార్టీకి పోటీగానే నిలుస్తున్నాయి. మహకూటమిగా ఇప్పటికే బరిలో నిలిచిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు గట్టి పొటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలువాలని బీజేపీ పట్టుదలతో ఉంది. బోథ్ ఖానాపూర్ లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు అధికార పార్టీతో తేల్చుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News