ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ప్రచారం.... ఊడిన ఉద్యోగం....

ఓ ప్రభుత్వ ఉద్యోగి అత్యుత్సాహంతో చేసిన పని అతడిని అడ్డంగా బుక్ చేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదని సదరు ఉద్యోగికి తెలియకనో, తెలిసి చేశాడోగానీ అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా ఒక పీఆర్ఓ అధికార పార్టీకి అనుకూలంగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పీఆర్ఓగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న […]

Advertisement
Update:2018-11-23 10:26 IST

ఓ ప్రభుత్వ ఉద్యోగి అత్యుత్సాహంతో చేసిన పని అతడిని అడ్డంగా బుక్ చేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదని సదరు ఉద్యోగికి తెలియకనో, తెలిసి చేశాడోగానీ అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా ఒక పీఆర్ఓ అధికార పార్టీకి అనుకూలంగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు.

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పీఆర్ఓగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బాబు అంటే వల్లమాలిన అభిమానం. ఆయన గెలుపుకోసం తహతహలాడాడు. ఎన్నికల నిబంధనలు తెలియక చేశాడో లేక నిజంగానే చేశాడో ఏమో కానీ రమేశ్ బాబుకు అనుకూలంగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.

దీంతో సదరు ఉద్యోగిపై కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడమేంటని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. దీనిపై జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా విచారించారు. చంద్రశేఖర్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు నిర్దారించి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News