నన్ను చంపేందుకు కేటీఆర్ కుట్ర....

సిరిసిల్ల జిల్లా కేంద్రం.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఇందిరాగాంధీ విజయరథం పేరుతో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నాయకులతో సమీక్షించి అర్ధరాత్రి హైదరాబాద్ బయలు దేరారు. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల చేరుకోగానే వీహెచ్ ప్రయాణిస్తున్న బస్సు వెనుక టైర్ ఊడిపోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు ఆపడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదంతో హతాసుడైన వీహెచ్ అక్కడే బస్సు పక్కన రోడ్డుపై గద్దె పై […]

Advertisement
Update:2018-11-22 05:15 IST

సిరిసిల్ల జిల్లా కేంద్రం.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఇందిరాగాంధీ విజయరథం పేరుతో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నాయకులతో సమీక్షించి అర్ధరాత్రి హైదరాబాద్ బయలు దేరారు. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల చేరుకోగానే వీహెచ్ ప్రయాణిస్తున్న బస్సు వెనుక టైర్ ఊడిపోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు ఆపడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదంతో హతాసుడైన వీహెచ్ అక్కడే బస్సు పక్కన రోడ్డుపై గద్దె పై కూర్చొని అర్ధరాత్రి నిరసన తెలిపాడు. డీఎస్పీ, సీఐలు చేరుకొని ఎంత సర్దిచెప్పినా వినకుండా తీవ్ర విమర్శలు చేశారు.

సోనియాగాంధీ సభ భగ్నం చేయాలని, హన్మంతరావు తిరగకుండా షాక్ ఇవ్వాలని కేటీఆర్ కుట్ర పన్నారని వీహెచ్ ఆరోపించారు. తాను కాంగ్రెస్ హయాంలో తిరుపతి నుంచి శ్రీకాకుళం, ఆదిలాబాద్ వరకూ తిరిగానని.. ఏ నాడు నా బండికి ఏ నట్లు ఊడిపోలేదని అన్నారు. సిరిసిల్లలో కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే కుట్రపన్నారని ఆరోపించారు. సిరిసిల్లలో కేసీఆర్, కేటీఆర్ లు ఏమీ చేయలేదని… తాను విమర్శించినందుకు కేటీఆర్ మెహెర్బానీ కోసం వారి కార్యకర్తలే ఈ పని చేసి ఉంటారని అనుమానించారు.

వీహెచ్ అర్ధరాత్రి నిరసనతో ఖంగుతిన్న పోలీసులు మెకానిక్ లను తీసుకొచ్చి టైర్లను బిగించి దీనిపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆయన బయలు దేరారు.

Tags:    
Advertisement

Similar News