టీడీపీ ఎమ్మెల్యేనా మజాకా...

కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు రెచ్చిపోయారు. పేకాటరాయుళ్ల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంట పాటు పోలీసులను అడ్డుకున్నారు. కాకినాడలోని టౌన్‌ హాల్ క్లబ్‌లో పేకాట జరుగుతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 58 మంది బడాబాబులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వెంటనే నిర్వాహకులు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుకు ఫోన్‌ చేశారు. ఆయన ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని అరెస్ట్ […]

Advertisement
Update:2018-11-22 01:38 IST

కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు రెచ్చిపోయారు. పేకాటరాయుళ్ల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంట పాటు పోలీసులను అడ్డుకున్నారు. కాకినాడలోని టౌన్‌ హాల్ క్లబ్‌లో పేకాట జరుగుతున్నట్టు జిల్లా ఎస్పీకి సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.

దాడుల్లో 58 మంది బడాబాబులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వెంటనే నిర్వాహకులు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుకు ఫోన్‌ చేశారు. ఆయన ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు.

పేకాట టేబుల్‌ వద్ద కూర్చుని హల్‌చల్ చేశారు. పేకాట రాయుళ్లకు ధైర్యం చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే దాడి చేశామని స్థానిక పోలీసులు విన్నవించుకున్నా ఎమ్మెల్యే లెక్కచేయలేదు. ఉన్నతాధికారులతోనూ ఫోన్ లో మాట్లాడి పోలీసులను వెనక్కు పిలిపించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం మీడియాకు తెలిసింది కాబట్టి అలా చేస్తే విమర్శలు వస్తాయని పోలీసులు విన్నవించుకున్నారు.

చివరకు కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ క్లబ్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుకు నెలనెల మామూళ్లు అందుతున్నాయని… కొద్దిరోజుల క్రితమే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు దాడులు జరిగాయని తెలియగానే ఎమ్మెల్యే ఆఘమేఘాల మీద క్లబ్‌కు వెళ్లి పేకాటరాయుళ్ల కోసం తపించడం చూసి ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు నిజమేనని స్థానికులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News