హెరిటేజ్‌ అక్రమాలపై రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు ఫిర్యాదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ సంస్థపై రిజిస్ట్రార్‌ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు అందింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఈ ఫిర్యాదు చేశారు. హెరిటేజ్‌ గ్రూపుకు చెందిన 14 కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆయన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు వివరించారు. ఈ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. హెరిటేజ్‌ సంస్థ 14 అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు రామారావు ఆరోపించారు. ఈ కంపెనీల ద్వారా అమితమైన లాభాలు వచ్చినట్టు […]

Advertisement
Update:2018-11-22 06:25 IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ సంస్థపై రిజిస్ట్రార్‌ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు అందింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఈ ఫిర్యాదు చేశారు. హెరిటేజ్‌ గ్రూపుకు చెందిన 14 కంపెనీలు తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆయన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు వివరించారు.

ఈ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. హెరిటేజ్‌ సంస్థ 14 అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు రామారావు ఆరోపించారు.

ఈ కంపెనీల ద్వారా అమితమైన లాభాలు వచ్చినట్టు చూపించారని… ప్రతి మూడు నాలుగు నెలలకు లాభాలు వేల కోట్లకు పెరిగిపోతున్నట్టు చూపించారని ఆరోపించారు. ఇదంతా మోసమని వ్యాఖ్యానించారు.

తిరిగి ఈ 14 కంపెనీలు ఎలాంటి వ్యాపారం చేస్తున్నాయని పరిశీలిస్తే అందులో సగం మూసివేసి ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కంపెనీయే స్వయంగా మూసివేసిన అనుబంధ కంపెనీల నుంచి వేల కోట్ల లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

అసలు కేవలం పాలు, పెరుగు, కూరగాయాలు అమ్మితే ఇన్ని వేల కోట్లు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే మొత్తం అక్రమాలు బయటకు వస్తాయని రామారావు రిజిస్ట్రార్‌ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేశారు.

న్యాయవాది రామారావు ఆర్‌ఓసీకి చేసిన ఫిర్యాదులో ఉన్న కంపెనీలు ఇవే…

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ ఆగ్రో మెరైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ న్యూట్రివెట్‌ లిమిటెడ్, నిర్వాణ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ప్యాకేజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ కాన్‌ప్రో లిమిటెడ్, నిర్వాణ లాజిస్టిక్స్‌ అండ్‌ వేర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రెడ్‌హిల్స్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ వేర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మెగాబిడ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెరిటేజ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌. ఇవన్నీ షెల్‌ కంపెనీలేనని న్యాయవాది రామారావు ఫిర్యాదులో వివరించారు.

Tags:    
Advertisement

Similar News