డబ్బులిస్తామన్నారు.... ప్రచారం చేయొద్దన్నారు.... కాంగ్రెస్ పై ఓవైసీ బాంబ్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పై బాంబు పేల్చాడు. తనకు రూ.25 లక్షలు ఇచ్చి టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేయొద్దని ప్రలోభ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆ ఫోన్ సంభాషణల ఆడియో తన దగ్గర ఉందంటూ సభలో చూపించారు. ప్రస్తుతం ఓవైసీ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎంఐఎం-టీఆర్ఎస్ స్నేహ పూర్వకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిపై ఒకరికి పోటీ లేకుండా చేసుకుంటూ […]

Advertisement
Update:2018-11-20 06:24 IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పై బాంబు పేల్చాడు. తనకు రూ.25 లక్షలు ఇచ్చి టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేయొద్దని ప్రలోభ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆ ఫోన్ సంభాషణల ఆడియో తన దగ్గర ఉందంటూ సభలో చూపించారు. ప్రస్తుతం ఓవైసీ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ దుమారానికి దారి తీస్తోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎంఐఎం-టీఆర్ఎస్ స్నేహ పూర్వకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిపై ఒకరికి పోటీ లేకుండా చేసుకుంటూ మంచి అవగాహనతో ఎన్నికల్లో సాగుతున్నారు. కేసీఆర్, ఓవైసీలు ఇద్దరూ తమ పార్టీలను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఎంఐఎం అధినేత ఓవైసీ తాము పోటీచేసే సీట్లతో పాటు తెలంగాణలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ఇతర చోట్లలో సభల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థులు బరిలో లేకపోవడంతో ముస్లింలు అంతా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇలా పొత్తు అధికారికంగా లేకున్నా ఓవైసీ టీఆర్ఎస్ ను గెలిపించాలని బహిరంగ సభల్లో మాట్లాడడం కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు..

నిజానికి వైఎస్ బతికున్న సమయంలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి నడిచాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక అక్బరుద్దీన్ పై దేశద్రోహం కేసు పెట్టడం.. అసదుద్దీన్ పై కేసులు తిరగదోడి ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెంచారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కు దూరం జరిగిన ఎంఐఎం పార్టీ తెలంగాణ వచ్చాక 2014 నుంచి టీఆర్ఎస్ తో దోస్తీ కంటిన్యూ చేస్తోంది.

తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. నిర్మల్ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిర్మల్ లో సభకు రావద్దని ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని.. దానికి తాను తూ.. అని ఉమ్మేసి డబ్బుతో ఓవైసీని కొనలేరని సమాధానం ఇచ్చానని వెల్లడించారు. ఆ ఫోన్ సంభాషణలు రికార్డు చేశానని, అవి తన వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు. దీంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఓవైసీతో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ ఇప్పుడు ఇబ్బంది పడుతోంది.

Tags:    
Advertisement

Similar News