జనసేనతో పొత్తు ప్రచారం కుట్రలో భాగమే " బొత్స
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీబీఐని ఏపీలోకి రాకుండా చంద్రబాబు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. నాడు ఎన్నికల సమయంలోనే జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ దాడులు చేయించారని గుర్తు చేశారు. కానీ అప్పుడు జగన్ ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొన్నారని బొత్స చెప్పారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి మోసకారితో కాంగ్రెస్ కలవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇద్దరు మాజీ సీఎస్‌లు […]
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీబీఐని ఏపీలోకి రాకుండా చంద్రబాబు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. నాడు ఎన్నికల సమయంలోనే జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ దాడులు చేయించారని గుర్తు చేశారు. కానీ అప్పుడు జగన్ ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొన్నారని బొత్స చెప్పారు.
ఏపీలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి మోసకారితో కాంగ్రెస్ కలవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇద్దరు మాజీ సీఎస్‌లు చంద్రబాబు అవినీతి గురించి చెబుతుంటే ప్రజలకు అర్థమవుతోందన్నారు.
ఉపాధి హామీ పథకంలో ఏడు వేల కోట్లు దారి మళ్లించారని.. ఒక మీడియా సంస్థకు ఏకంగా ఏడు వందల కోట్లు కట్టబెట్టారని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తాము ఎప్పుడో చెప్పామని… ఇప్పుడు అది రుజువవుతోందన్నారు. హాయ్‌లాండ్ భూమిని ప్రభుత్వ పెద్దలు కాజేసేందుకే అగ్రిగోల్డ్‌తో హాయ్‌లాండ్‌కు సంబంధం లేదని చెప్పిస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు.
జాతీయ పార్టీలు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. తెరవెనుక టీడీపీతో జనసేన స్నేహం చేస్తోందని బొత్స ఆరోపించారు. తిరిగి జనసేన, వైసీపీ మధ్య పొత్తు ఉంటుందని… జనసేనకు 45 సీట్లు ఇస్తారంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ద్వారా ఈ లీకులు ఇప్పించడం వెనుక కుట్ర దాగి ఉందని బొత్స ఆరోపించారు. వైసీపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోబోదని స్పష్టం చేశారు. సింగిల్‌గానే 2019 ఎన్నికలను ఎదుర్కొంటామని బొత్స తేల్చిచెప్పారు. త్వరలో పోలీసు అధికారులే బయటకు వచ్చి టీడీపీ అవినీతి గురించి బయట పెడతారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.