వసంత పంచమి విశేషాలివి

జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ మాత పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు

Advertisement
Update:2025-02-02 11:03 IST

మాఘశుద్ధ పంచమిన చదువుల తల్లి పుట్టింది. ఈ రోజునే వసంత పంచమిగా పిలుస్తారు. చలికాలానికి, ఎండాకాలనికి సంధికాలం కావడంతో ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వసంత పంచమి రోజున హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడుతారు.

అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరిచినచోటే ఉంటానని పద్మంలో ఆసనం వేసుకొని కూర్చుంటుంది సరస్వతీ దేవి. బ్రహ్మదేవుని సృష్టి రచనకు కావాల్సిన సృజనాత్మక శక్తిని ప్రసాదించింది కూడా సరస్వతీ మాతేనని పురాణాలు చెబుతున్నాయి. జ్ఞానాన్ని ప్రసాదించే ఈ మాత పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. దీంతో వారికి విద్యాబుద్ధులను సాక్షాత్కరిస్తుందని వారి నమ్మకం .

వాగ్దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు. అందుకే 'వేదమాత' అని కూడా పిలుస్తారు. ప్రతిభ, ప్రజ్ఞ, ధారణ, వాక్‌ సంపద ఆ మాత వల్లనే కలుగుతాయని శాస్త్రాల నమ్మకం. అజ్ఞాన సంహరణ ఆయుధాలతో కాదు, జ్ఞానకాంతితోనే సాధ్యమౌతుంది. అందుకే సరస్వతీ మాట ఆయుధాలను ధరించదు. జ్ఞానకాంతి ఉంటే.. ఏ ఆయుధాలూ అవసరం లేదని సరస్వతీదేవి స్పష్టం చేస్తుంది. శుద్ధ, శాంత స్వభావులకు మాత్రమే జ్ఞానం ప్రసాదిస్తుందట. సరస్వతి దేవి వాహనం హంస, నీళ్లు కలిపిన పాలల్లో నీళ్లను వదిలేసి పాలను మాత్రమే తాగుతుంది. అలాగే మనుషులు కూడా అనవసర విషయాలను వదిలేసి, జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవాలని దీని భావం. 

Tags:    
Advertisement

Similar News