ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) నియమితులయ్యారు. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గతంలో జగన్ ప్రభుత్వం రెండుసార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. రెండోసారి 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్ విధించింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్వరులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ఏబీవీకి ఇవ్వాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని స్పష్టం చేసింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంతమొత్తంలో ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఏబీవీపై నమోదు చేసిన అభియోగాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం విదితమే.