కూటమిలో బాబు లెక్కలు చెల్లుబాటు కాలేదా!

మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీనే పెద్దన్న. అయితే కీ మాత్రం చంద్రబాబు చేతిలో ఉందని…. అంతా చంద్రబాబు చెప్పిందే జరుగుతుందని…. అని చాలా మంది అంటూ వచ్చారు. మెజారిటీ సీట్లకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీనే అయినా.. అభ్యర్థులు మాత్రం చంద్రబాబు చెప్పిన వాళ్లే నిలుస్తారని..ఇలా కాంగ్రెస్ మీద చంద్రబాబు ఆధిపత్యానికి కూటమి సాక్ష్యంగా నిలవబోతోందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమ అభ్యర్థుల జాబితాతో చంద్రబాబును కలిసి.. బలహీనతను బయటపెట్టేసుకున్నారనే మాట కూడా […]

Advertisement
Update:2018-11-18 09:30 IST
కూటమిలో బాబు లెక్కలు చెల్లుబాటు కాలేదా!
  • whatsapp icon

మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీనే పెద్దన్న. అయితే కీ మాత్రం చంద్రబాబు చేతిలో ఉందని…. అంతా చంద్రబాబు చెప్పిందే జరుగుతుందని…. అని చాలా మంది అంటూ వచ్చారు. మెజారిటీ సీట్లకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీనే అయినా.. అభ్యర్థులు మాత్రం చంద్రబాబు చెప్పిన వాళ్లే నిలుస్తారని..ఇలా కాంగ్రెస్ మీద చంద్రబాబు ఆధిపత్యానికి కూటమి సాక్ష్యంగా నిలవబోతోందని వార్తలు వచ్చాయి.

అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమ అభ్యర్థుల జాబితాతో చంద్రబాబును కలిసి.. బలహీనతను బయటపెట్టేసుకున్నారనే మాట కూడా వినిపించింది.

అయితే…. ఇప్పుడు కూటమిలో చంద్రబాబు చక్రం అంత గట్టిగా తిరగడం లేదు అని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి కొన్ని సీట్ల విషయంలో చంద్రబాబు వేసిన లెక్కలు వేరయితే.. అభ్యర్థులు మాత్రం మరో రకంగా తెరమీదకు వచ్చారని స్పష్టం అవుతోంది.

బాబు కొన్ని సీట్ల విషయంలో రాజకీయం చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కమ్మ అభ్యర్థిని బరిలోకి దించాలని బాబు అనుకున్నాడు. అక్కడ పీజేఆర్ తనయుడు విష్ణుకు టికెట్ వద్దని బాబు అన్నాడట.
అందుకే తొలి జాబితాలో విష్ణుకు టికెట్ దక్కలేదు.

అయితే చివరకు ఏమైందో కానీ…. మళ్లీ జాబితాలో విష్ణుకే టికెట్ ను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కమ్మ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలన్న చంద్రబాబు ఒత్తిడి అక్కడ ఫలించలేదు.

ఇక ఎల్బీనగర్ సీటు విషయంలో కూడా చంద్రబాబు మార్కు రాజకీయం జరిగిందని అంటారు. అక్కడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టికెట్ వద్దు అని చంద్రబాబు నాయుడు అన్నాడట. కానీ.. చివరకు కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం.. సుధీర్ రెడ్డికే టికెట్ ను ఖరారు చేసింది. అక్కడ తను చెప్పిన వారిని నిలపాలని బాబు ప్రయత్నించినట్టుగా సమాచారం.

కానీ సనత్ నగర్ సీటు విషయంలో మాత్రం బాబు రాజకీయం నెగ్గిందని అంటున్నారు. అక్కడ నుంచి కూన వెంకటేష్ గౌడ్ బాబు ఆశీస్సులతో పోటీ చేస్తున్నాడు. సీనియర్ నేత శశిధర్ రెడ్డిని పక్కన పెట్టి సైతం కాంగ్రెస్ అధిష్టానం బాబు మాట మేరకు కూనకు టికెట్ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News