ఇక యాడ్స్ పెట్టుకునే అవకాశం టీడీపీ ఒక్కదానికేనా?
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ప్రకాశ్ ఆర్ట్స్ యాడ్ ఏజెన్సీ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ప్రకాశ్ ఆర్ట్స్ తీరుపై విజయవాడలో జనసేన, వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రకాశ్ ఏజెన్సీకి కొండంత అండగా నిలుస్తున్నారు. కోట్లాది రూపాయల బకాయిలు విజయవాడ కార్పొరేషన్‌కు చెల్లించక పోయినా సరే తిరిగి హోర్డింగ్‌లు, ప్రభుత్వ ప్రాంతంలో హోర్డింగ్‌లు, ప్రకటనలు వేసుకునే కాంట్రాక్టును కట్టబెట్టారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ స్టాండ్‌లో ప్రకటన కాంట్రాక్టును కూడా ప్రకాశ్ ఆర్ట్స్‌కే కట్టబెట్టారు. […]
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ప్రకాశ్ ఆర్ట్స్ యాడ్ ఏజెన్సీ రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ప్రకాశ్ ఆర్ట్స్ తీరుపై విజయవాడలో జనసేన, వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.
టీడీపీ నేతలు మాత్రం ప్రకాశ్ ఏజెన్సీకి కొండంత అండగా నిలుస్తున్నారు. కోట్లాది రూపాయల బకాయిలు విజయవాడ కార్పొరేషన్‌కు చెల్లించక పోయినా సరే తిరిగి హోర్డింగ్‌లు, ప్రభుత్వ ప్రాంతంలో హోర్డింగ్‌లు, ప్రకటనలు వేసుకునే కాంట్రాక్టును కట్టబెట్టారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ స్టాండ్‌లో ప్రకటన కాంట్రాక్టును కూడా ప్రకాశ్ ఆర్ట్స్‌కే కట్టబెట్టారు. ప్రభుత్వానికి ప్రకాశ్ ఆర్ట్స్ సంస్థ 12 కోట్లు బకాయి ఉంది. విజయవాడ కార్పొరేషన్‌కు ఆరు కోట్ల మేర బకాయి ఉన్నట్టు స్వయంగా విజయవాడ మేయరే చెబుతున్నారు.
అయినా సరే తిరిగి ఏసీ బస్ స్టేషన్లను కూడా ప్రకాశ్ సంస్థకే అప్పగించారు. ఇలా చేయడంపై విజయవాడ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్ ఆర్ట్స్ యాడ్స్ ఏజెన్సీ కేవలం టీడీపీకి వంతపాడుతోందని మండిపడ్డారు. టీడీపీకి సంబంధించిన ప్రకటనలకు మాత్రమే ప్రకాశ్ ఆర్ట్స్ సంస్థ హోర్డింగ్‌లను ఇస్తోందని ఆరోపిస్తున్నారు.
వ్యాపార, టీడీపీ ప్రకటనలకు మాత్రమే చోటు ఇస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ, జనసేన నేతలు ప్రచారం కోసం హోర్డింగ్ అడిగితే ప్రకాశ్ ఆర్ట్స్ సంస్థ స్పందించడం లేదంటున్నారు. కేవలం టీడీపీకి మాత్రమే పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు.
అసలు ప్రభుత్వానికి డబ్బు చెల్లించకుండా కోట్లాది రూపాయలు బకాయి పడ్డ సంస్థకు తిరిగి ఏసీ బస్ స్టేషన్లను కూడా ఎందుకు అప్పగించారని మేయర్‌ను ప్రశ్నిస్తే… పాత బకాయిలు, కొత్త కాంట్రాక్టుకు చెల్లించాల్సిన సొమ్ము ఒకేసారి చెల్లిస్తామని హామీ ఇచ్చారని అందుకే ప్రకాశ్ యాడ్స్ సంస్థకు అనుమతి ఇచ్చామని మేయర్ చెబుతున్నారు.
మొత్తం మీద విజయవాడలో హోర్డింగ్‌లు పెట్టుకునే అవకాశం కూడా ప్రతిపక్షాలకు లేకుండా టీడీపీ నేతలు ఇలా ఎత్తులు వేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.