ఎన్టీఆర్ సాగర్ గా పేరు మార్పు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి డిజైన్ల కోసం నాలుగున్నరేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆరు నెలలకోసారి కొత్త గ్రాఫిక్స్ బొమ్మలు వదిలి ఇలా ఉంటుంది అమరావతి అని చెబుతూ వచ్చారు. ఏదేశానికి వెళ్లినా అక్కడ ఉండే మంచి నగరాన్ని సందర్శించి అదే తరహాలో అమరావతి నగరం నిర్మిస్తాం అని పలుమార్లు చెప్పారు. సింగపూర్ , న్యూయార్క్, ఇస్తాంబుల్, టోక్యో, లండన్ ఇలా ఏ నగరానికి వెళితే ఆ నగరం తరహాలో అమరావతి నిర్మిస్తామని చెప్పారు. ఆ మధ్య […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి డిజైన్ల కోసం నాలుగున్నరేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆరు నెలలకోసారి కొత్త గ్రాఫిక్స్ బొమ్మలు వదిలి ఇలా ఉంటుంది అమరావతి అని చెబుతూ వచ్చారు. ఏదేశానికి వెళ్లినా అక్కడ ఉండే మంచి నగరాన్ని సందర్శించి అదే తరహాలో అమరావతి నగరం నిర్మిస్తాం అని పలుమార్లు చెప్పారు.
సింగపూర్ , న్యూయార్క్, ఇస్తాంబుల్, టోక్యో, లండన్ ఇలా ఏ నగరానికి వెళితే ఆ నగరం తరహాలో అమరావతి నిర్మిస్తామని చెప్పారు. ఆ మధ్య బాహుబలి సినిమా మానియా నడిచిన సమయంలో ఏకంగా రాజమౌళిని పిలిపించి బాహుబలి సినిమా సెట్టింగ్ తరహాలో అమరావతి నిర్మించేలా హడావుడి చేశారు.
అయినా ఇప్పటి వరకు అమరావతిలో శాశ్వతంగా ఒక ఇటుకను కూడా వేసుకోలేదు. తాజాగా చంద్రబాబు అమరావతికి కొత్త డిజైన్ ప్రతిపాదించారు. అమరావతిలో భవనాలను తాజ్‌మహల్ తరహాలో నిర్మిస్తామని ప్రకటించారు. అమరావతిలో ఎఫ్1 హెచ్2 రేసును ప్రారంభించిన చంద్రబాబు… వాటర్ రేస్‌కు రాజధానిగా అమరావతిని మారుస్తామన్నారు. వాటర్ రేస్ నిర్వహించే ప్రాంతానికి ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు.