టీ-20 మహిళా ప్రపంచకప్ లో బిగ్ ఫైట్

గ్రూప్-బీ లీగ్ ఆఖరిరౌండ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీ మూడుకు మూడూ నెగ్గిన ఆసీస్, భారత్ శనివారం రాత్రి 8-30కి భారత్-ఆస్ట్రేలియా జట్ల పోటీ టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో అతిపెద్ద సమరానికి… గయానా నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. గ్రూప్ టాపర్ స్థానం కోసం ..శనివారం జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో..ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, 5వ ర్యాంకర్ భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్ జట్లను…ఇటు ఆస్ట్రేలియా…అటు భారత్ ఓడించడం […]

Advertisement
Update:2018-11-16 14:30 IST
  • గ్రూప్-బీ లీగ్ ఆఖరిరౌండ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
  • మూడుకు మూడూ నెగ్గిన ఆసీస్, భారత్
  • శనివారం రాత్రి 8-30కి భారత్-ఆస్ట్రేలియా జట్ల పోటీ

టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో అతిపెద్ద సమరానికి… గయానా నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

గ్రూప్ టాపర్ స్థానం కోసం ..శనివారం జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో..ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, 5వ ర్యాంకర్ భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్ జట్లను…ఇటు ఆస్ట్రేలియా…అటు భారత్ ఓడించడం ద్వారా…ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగాయి. గ్రూప్ టాపర్ స్థానం కోసం ఇప్పుడు ఢీ కొనబోతున్నాయి.

మూడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు …భారత్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. శనివారం రాత్రి 8 గంటల 30 నిముషాలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

Tags:    
Advertisement

Similar News