టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ లో భారత్

ఐర్లాండ్ పై 52 పరుగులతో భారత్ విజయం విజయాల హ్యాట్రిక్ తో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్ మిథాలీ రాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు భారత్ మూడోసారి అర్హత సంపాదించింది. కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో…. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా మూడో విజయంతో నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది. గయానా నేషనల్ స్టేడియం […]

Advertisement
Update:2018-11-16 09:10 IST
  • ఐర్లాండ్ పై 52 పరుగులతో భారత్ విజయం
  • విజయాల హ్యాట్రిక్ తో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్
  • మిథాలీ రాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు భారత్ మూడోసారి అర్హత సంపాదించింది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో…. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా మూడో విజయంతో నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది.

గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో రౌండ్ పోటీలో ఐర్లాండ్ ను భారత్ చిత్తు చేసింది.

ఈ పోటీలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు సాధించింది.

ఓపెనర్ మిథాలీ రాజ్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సమాధానంగా 146 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 93 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో 52 పరుగుల భారీ విజయంతో భారత్ విజయాల హ్యాట్రిక్ పూర్తి చేసింది.

భారత ఓపెనర్ మిథాలీరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి రౌండ్లో న్యూజిలాండ్, రెండో రౌండ్లో పాకిస్థాన్ జట్లను చిత్తు చేసిన భారత్… శనివారం జరిగే ఆఖరి రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News