రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక రెడ్డి ధర్నా
కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ తెగడం లేదు. హఠాత్తుగా కొత్తవారిని తెరపైకి తెస్తుండడంతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. సికింద్రాబాద్ టికెట్ ఆశించిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఏకంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు భర్త చంద్రారెడ్డితో కలిసి ధర్నాకు దిగారు. యాకత్‌పురా టికెట్ ఆశిస్తున్న కీర్తి రాజేంద్రరాజు కూడా రాహుల్ ఇంటి ముందు బైఠాయించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని కార్తీక రెడ్డి ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి తన భర్త చంద్రారెడ్డి పార్టీ […]
కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ తెగడం లేదు. హఠాత్తుగా కొత్తవారిని తెరపైకి తెస్తుండడంతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. సికింద్రాబాద్ టికెట్ ఆశించిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఏకంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు భర్త చంద్రారెడ్డితో కలిసి ధర్నాకు దిగారు.
యాకత్‌పురా టికెట్ ఆశిస్తున్న కీర్తి రాజేంద్రరాజు కూడా రాహుల్ ఇంటి ముందు బైఠాయించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని కార్తీక రెడ్డి ఆరోపించారు.
30 ఏళ్ల నుంచి తన భర్త చంద్రారెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశామన్నారు. సర్వే రిపోర్టుల్లోనూ తనపేరే నెంబర్ వన్‌గా ఉందన్నారు కార్తీక రెడ్డి.
కానీ ఇప్పుడు హఠాత్తుగా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి పనిచేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.
మహిళలను ప్రోత్సహిస్తామని రాహుల్ చెప్పారని… కానీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరుగుతోందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. తనకు మేయర్‌గా చేసిన రికార్డు కూడా ఉందన్నారు. టికెట్లు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్యారాచూట్ పట్టుకుని వచ్చిన నేతలకు టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు.
కొద్ది సేపటి క్రితం కుంతియా ఫోన్ చేసి కొత్త వ్యక్తిని బయటి నుంచి తీసుకొస్తున్నామని…. పనిచేయాలని చెప్పారన్నారు. అసలు ఆ అభ్యర్థి ఎవరో కూడా చెప్పడం లేదని ఇదో విచిత్రమైన పరిస్థితి అన్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తికి తనకంటే ఎక్కువ అర్హతలు ఉంటే చెప్పాలన్నారు బండ కార్తీక రెడ్డి.