నకిలీ వార్తల కట్టడికి వాట్సప్ సరికొత్త నిర్ణయం
ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పలు సవరణలు చేసుకుంటూ వస్తున్న వాట్సప్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫేక్ న్యూస్ మూలంగా దాడులు, అసాంఘిక చర్యలు ఎక్కువై పోయాయి. ఇటువంటి వార్తలు వ్యాప్తి జరగకుండా కట్టడి చేస్తే ప్రయోజనం ఉంటుందని భావించి పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, మెక్సికో, నెదర్లాండ్స్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూకే, అమెరికా దేశాలతో పాటు భారత్ నుంచి కూడా బృందాలను ఎంపిక చేసింది. మొత్తం […]
ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పలు సవరణలు చేసుకుంటూ వస్తున్న వాట్సప్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫేక్ న్యూస్ మూలంగా దాడులు, అసాంఘిక చర్యలు ఎక్కువై పోయాయి. ఇటువంటి వార్తలు వ్యాప్తి జరగకుండా కట్టడి చేస్తే ప్రయోజనం ఉంటుందని భావించి పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, మెక్సికో, నెదర్లాండ్స్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూకే, అమెరికా దేశాలతో పాటు భారత్ నుంచి కూడా బృందాలను ఎంపిక చేసింది. మొత్తం 20 పరిశోధనా బృందాలు ఫేక్ న్యూస్ కట్టడికి పనిచేయనున్నాయి. అసలు అలాంటి వార్తలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయి? అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై ఈ బృందాలు పనిచేస్తాయని వాట్సాప్ తెలిపింది.
భారత్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, మూక హింస అంశాలపై పరిశోధనలు జరిపేందుకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్(ఎల్‌ఎస్‌ఈ) నుంచి శకుంతల బనాజీ, రామ్‌నాథ్ భట్, బెంగళూరులోని మారా మీడియాకు చెందిన అన్షు అగర్వాల్, నిహాల్ పస్నాతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఒక్కో బృందానికి 50వేల డాలర్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు వాట్సప్ తెలిపింది.
వాట్సాప్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు, పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని ఈ ఏడాది జులైలో వాట్సాప్ కోరింది. ప్రపంచవ్యాప్తంగా 600 బృందాలు ప్రతిపాదనలను పంపాయి. వీటిలో నుంచి 20 బృందాలను ఎంపిక చేసినట్లు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.