మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.... రాజీకి పోలీసుల యత్నం

మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిర్భయ లాంటి ఘటనను తలపిస్తున్న ఈ ఘోరానికి పోలీసు అధికారులు సహకరించడం సంచలనంగా మారింది. అభం శుభం తెలియని మైనర్ బాలిక పై సామూహిక అత్యారానికి పాల్పడిన నిందితులను రక్షించేందుకు, కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. బాలిక కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగడంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారు కొందరు దుర్మార్గులు. ఆమెకు చికిత్స విఫలమై మృతిచెందిన […]

Advertisement
Update:2018-11-13 13:45 IST

మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిర్భయ లాంటి ఘటనను తలపిస్తున్న ఈ ఘోరానికి పోలీసు అధికారులు సహకరించడం సంచలనంగా మారింది. అభం శుభం తెలియని మైనర్ బాలిక పై సామూహిక అత్యారానికి పాల్పడిన నిందితులను రక్షించేందుకు, కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. బాలిక కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగడంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే..

ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారు కొందరు దుర్మార్గులు. ఆమెకు చికిత్స విఫలమై మృతిచెందిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగింది. ఆరూర్ చిక్లింగ్ ప్రాంతానికి చెందిన అన్నామలై, మలర్ దంపతుల కుమార్తె సౌమ్య (17) అనే ఆదివాసి బాలిక మరణించిందని సోమవారం పోలీసులు చెప్పారు. కేసు క్లోజ్ చెయ్యడానికి డీఎస్పీ స్థాయి అధికారి ఒత్తిడి తీసుకువస్తున్నాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో నివాసం ఉంటున్న సౌమ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దీపావళి సందర్బంగా ఇటీవల సౌమ్య హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది. మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని పొదల్లో బహిర్భూమికి వెళ్లింది.ఆ సందర్బంలో కామాంధులు బాలికను లాక్కొని వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. సౌమ్య ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి మలర్ సమీపంలోని పొదల దగ్గరకు వెళ్లింది. కూతురు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

చివరికి ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య తన గ్రామానికి చెందిన రమేష్, సతీష్ అనే ఇద్దరు బలవంతంగా లాక్కెళ్లారని, తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలకుండా అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది.

సౌమ్యకు చికిత్స చేసిన తరువాత ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స విఫలమై మరణించింది. కాగా, నిందితులను రక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారి బెదిరిస్తున్నాడని బాలిక తండ్రి అన్నామలై ఆరోపించారు.

గ్రామంలోని కొందరు పెద్దలు కేసు లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వెనుక బడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ధర్మపురి జిల్లా మొత్తం ఆందోళన చేస్తున్నాయి. నిందితులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చెయ్యాలని పీఎంకే నేత, ధర్మపురి ఎంపీ అన్బుమణి రాందాస్ డిమాండ్ చేస్తున్నారు

Tags:    
Advertisement

Similar News