పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్.... పొన్నాలకు మొండిచేయి
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. జాబితాలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు నిలుపుకున్నారు. అన్నదమ్ములిద్దరూ టికెట్లు సాధించారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గం టికెట్ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్యకు కాకుండా ఇంటిపార్టీకి కేటాయించేలా కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు పావులు కదిపారు. కానీ లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను కూడా […]
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. జాబితాలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు నిలుపుకున్నారు. అన్నదమ్ములిద్దరూ టికెట్లు సాధించారు.
నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గం టికెట్ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్యకు కాకుండా ఇంటిపార్టీకి కేటాయించేలా కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు పావులు కదిపారు. కానీ లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను కూడా ఓడిస్తామని వెంకటరెడ్డి ఇటీవల హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకే కాంగ్రెస్ కేటాయించింది. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు సాధించిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కాంగ్రెస్ టికెట్ దక్కింది. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు.
మరోవైపు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు హ్యాండిచ్చేలాగే ఉన్నారు. జనగామ నుంచి ఆయన పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పేరును ప్రకటించలేదు. ఇక్కడ నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో మిత్రపక్షానికి కేటాయించే ఉద్దేశంతోనే జనగామ టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని భావిస్తున్నారు.
అటు మహాకూటమిలో ఉన్న సీపీఐ కొత్తగూడెం టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ మాత్రం కొత్తగూడెం నుంచి అభ్యర్థిని ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం టికెట్‌ను కాంగ్రెస్ కేటాయించింది.