క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? : టీటీడీ చైర్మన్
క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా అంటు టీటీడీ చైర్మన్ షాకింగ్ కామెంట్స్ చేశారు
తిరుమల తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు ఎవరిపైన నెట్టడం లేదని ఎంక్వరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ తొక్కిసలాటకు బాధ్యతగా టీటీడీ వాళ్ళు భక్తులకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. దానికి తాజాగా ఛైర్మన్ స్పందిస్తూ.. చెప్పడంలో సమస్య లేదు.. చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా.. ఎవరో అన్నదానికి మేము రియాక్ట్ కావాల్సిన అవసర లేదు అంటూ కామెంట్స్ చేసారు.
దాంతో ఇప్పుడు పవన్ కు వ్యతిరేకంగా బిఆర్ నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. మరణించిన వారికి రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడని వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ నగదును రేపు స్వయంగా పాలక మండలి సభ్యులు... మృతుల కుటుంబ సభ్యులకు అందజేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.