బెల్లంప‌ల్లి వైపు వినోద్ చూపు !

కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న గ‌డ్డం వినోద్ దారెటు? ఇప్పుడు ఆదిలాబాద్ రాజ‌కీయాల్లో ఇదే చ‌ర్చ‌గా మారింది. చెన్నూరు నుంచి పోటీ చేస్తారా? లేదా మ‌రో సీటుకు మారుతారా? అనేది స‌స్పెన్స్‌గా మారింది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లిశారు. కానీ సోద‌రులిద్ద‌రూ క‌లిసి వ‌స్తేనే టికెట్ ఇస్తామ‌ని కాంగ్రెస్ ష‌ర‌తు పెట్టింది. దీంతో బెల్లంప‌ల్లి సీటు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కానీ కాంగ్రెస్ మాత్రం హామీ ఇవ్వ‌లేదు. చెన్నూరు టికెట్ ఇవ్వ‌లేమ‌ని టీఆర్ఎస్ తేల్చి […]

Advertisement
Update:2018-11-12 01:45 IST

కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న గ‌డ్డం వినోద్ దారెటు? ఇప్పుడు ఆదిలాబాద్ రాజ‌కీయాల్లో ఇదే చ‌ర్చ‌గా మారింది. చెన్నూరు నుంచి పోటీ చేస్తారా? లేదా మ‌రో సీటుకు మారుతారా? అనేది స‌స్పెన్స్‌గా మారింది.

ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లిశారు. కానీ సోద‌రులిద్ద‌రూ క‌లిసి వ‌స్తేనే టికెట్ ఇస్తామ‌ని కాంగ్రెస్ ష‌ర‌తు పెట్టింది. దీంతో బెల్లంప‌ల్లి సీటు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కానీ కాంగ్రెస్ మాత్రం హామీ ఇవ్వ‌లేదు.

చెన్నూరు టికెట్ ఇవ్వ‌లేమ‌ని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వినోద్ కు హామీ ఇచ్చారు. కానీ వినోద్ మాత్రం హామీ ప‌ట్ల సంతృప్తిగా లేరు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? లేక‌పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా? అనే విష‌యంపై వినోద్ ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అటు మాజీ ఎంపీ వివేక్ మాత్రం టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఆసక్తి చూపడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వివేక్ టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్నారు. వినోద్ మాత్రం తన సోదరుని అభిప్రాయంతో విభేదిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కాలం క‌లిసి వ‌స్తే చెన్నూరు నుంచి పోటీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. లేక‌పోతే బెల్లంప‌ల్లి నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నారు. వినోద్ బెల్లంప‌ల్లికి వ‌స్తే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇప్ప‌టికే 32 మంది కౌన్సిల‌ర్లు ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో వినోద్ బెల్లంప‌ల్లికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇండిపెండెంట్‌గా లేదా బీఎస్సీ లేదా ఇత‌ర పార్టీల త‌ర‌పున పోటీ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ని వినికిడి. బెల్లంప‌ల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. మున్సిప‌ల్ రాజ‌కీయంలో చిన్న‌య్య ఒంట‌రి అయ్యారు. దీంతో వినోద్ బెల్లంప‌ల్లి వెళితే గెల‌వ‌డం ఈజీ అని ఆయ‌న అనుకుంటున్నారట‌. సోమ‌వారం నుంచి నామినేష‌న్ల కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతుంది. మ‌రీ వినోద్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News