బీజేపీ వ్యతిరేక పార్టీలతో భేటీల వల్ల ఏం లాభం.... బీజేపీతో ఉన్న పార్టీలను తీసుకురా చూద్దాం.... బాబూ

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానంటూ…. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు కలుస్తుండడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీల అధినేతలను.. ఇటీవలే బీజేపీ నుంచి దూరం జరిగిన చంద్రబాబు కలుస్తూ …. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేస్తాను అనడం విచిత్రంగా ఉందంటున్నారు సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు. ఆయన చంద్రబాబు రాజకీయాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా […]

Advertisement
Update:2018-11-10 10:20 IST

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానంటూ…. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు కలుస్తుండడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

దశాబ్దాలుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీల అధినేతలను.. ఇటీవలే బీజేపీ నుంచి దూరం జరిగిన చంద్రబాబు కలుస్తూ …. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేస్తాను అనడం విచిత్రంగా ఉందంటున్నారు సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు. ఆయన చంద్రబాబు రాజకీయాన్ని తప్పుపట్టారు.

ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను చంద్రబాబు కలవడం వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. బీజేపికి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేయాలనుకుంటే ముందు చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను విడదీయాలని సలహా ఇచ్చారు.

దేశంలో మహాకూటమి ఏర్పాటు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి ఎన్నికల తర్వాతే పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడితే బాగుంటుందని రాఘవులు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో మోడీతో పాటు చంద్రబాబు కూడా దోషేనని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News