చంద్రబాబుపై జలీల్ ఖాన్ గరం గరం....

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు తెరలేపారు. మంత్రి వర్గంలో చోటు కోసం పార్టీ మారిన జలీల్ ఖాన్ లాంటి వాళ్లకు ఆ ఆశ నెరవేరడం లేదు. తాజాగా మంత్రి వర్గంలోకి ఫరూక్ ను తీసుకుంటున్నట్లు తెలిసి ఆయన తోక తొక్కిన పాములా బుసలు కొడుతున్నారు. వైసీపీలో గెలిచిన జలీల్ ఖాన్…. టీడీపీలో చేరారు. మంత్రి పదవి హామీ మేరకే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత […]

Advertisement
Update:2018-11-10 11:10 IST

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు తెరలేపారు. మంత్రి వర్గంలో చోటు కోసం పార్టీ మారిన జలీల్ ఖాన్ లాంటి వాళ్లకు ఆ ఆశ నెరవేరడం లేదు. తాజాగా మంత్రి వర్గంలోకి ఫరూక్ ను తీసుకుంటున్నట్లు తెలిసి ఆయన తోక తొక్కిన పాములా బుసలు కొడుతున్నారు.

వైసీపీలో గెలిచిన జలీల్ ఖాన్…. టీడీపీలో చేరారు. మంత్రి పదవి హామీ మేరకే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత జరిగిన ఓ ఇంటర్య్వూలో బీకాంలో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయిపోయారు. చంద్రబాబు కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హ్యాండ్ ఇచ్చారు. పెద్ద ఉద్యమమే నడిచిన అనంతరం ఎట్టకేలకు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే…. గతి ఇలానే ఉంటుందని జలీల్ కు ఆలస్యంగా తెలిసొచ్చినట్లుంది.

తాజాగా, రాష్ట్ర మంత్రివర్గంలోకి ఫరూక్ ను తీసుకోవడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న జలీల్ ఖాన్ తనకు విస్తరణలో మంత్రివర్గంలో చోటుకల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇద్దరు మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటు అసాధ్యమని సీఎం తేల్చి చెప్పినట్లు సమాచారం. గరం గరం గా ఉన్న జలీల్ ఖాన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని అయన అనుయాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News