మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.....

ప్రస్తుతం తనను ఏ వ్యవస్థా ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఓటుకు నోటులో దొరికిపోయినా అదును చూసి మరోసారి చంద్రబాబు తన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో ఎన్నికలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు మొత్తం తన మీద వేసుకున్న చంద్రబాబు ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా తెలంగాణలో మోహరించి ముందుకెళ్తున్నారు. […]

Advertisement
Update:2018-11-07 04:52 IST

ప్రస్తుతం తనను ఏ వ్యవస్థా ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఓటుకు నోటులో దొరికిపోయినా అదును చూసి మరోసారి చంద్రబాబు తన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో ఎన్నికలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు మొత్తం తన మీద వేసుకున్న చంద్రబాబు ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా తెలంగాణలో మోహరించి ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కోట్లాది రూపాయలు అందజేయడంతోపాటు టీఆర్‌ఎస్ రెబల్స్‌ను కూడా క్యాష్‌తో కొట్టబోతున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం 500 కోట్లు కేటాయిస్తున్న చంద్రబాబు… టీఆర్‌ఎస్ రెబల్స్‌ను గుర్తించి వారిని బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పది వేల ఓట్లు చీల్చే నేత ఉంటే చాలు వారికి బాబు గాలం వేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ రెబల్‌గా బరిలో దిగితే రూ. 5 కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు టీం ఆఫర్ చేస్తోంది. 112 నియోజక వర్గాల్లో ఇలాంటి వారిని గుర్తించాలని ఏపీ ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని చంద్రబాబు ఆదేశించారు. అందుకు తగ్గట్టు ఏపీ ఇంటెలిజెన్స్ ఆ పనిలో ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఒక టీడీపీ అనుకూల పత్రికాధినేత ద్వారా చంద్రబాబు నడుపుతున్నారు.

మొన్నటి వరకు ఆ పత్రికాధినేత కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్నట్టు నటించి టీఆర్‌ఎస్‌ను బురిడీ కొట్టించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం, టీఆర్‌ఎస్ రెబల్స్‌ను గుర్తించి 5 కోట్లు కేటాయించడం వంటి వ్యవహారాలను ఇంటెలిజెన్స్, పత్రికాధినేత ద్వారా నడుపుతున్న చంద్రబాబు… తాజాగా మీడియా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

తన సొంత సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. వీరంతా ఎప్పటికప్పుడు మహాకూటమికి అనుకూలంగా ఎలాంటి వార్తలు రావాలి, ఎలాంటి కథనాలు అల్లాలి అన్న దానిపై సలహాలు ఇస్తుంటారు.

Tags:    
Advertisement

Similar News