కేసీఆర్ సంక్షేమ సెంటిమెంట్ ఓట్లు రాలుస్తుందా?
2014 ఎన్నికలు వేరు. ఇప్పుడు జరుగుతున్నఎన్నికలు వేరు. తెలంగాణ తెచ్చిన ఘనతతో కేసీఆర్‌కు జనం పట్టం కట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నాలుగేళ్ల పరిపాలనపై జనం తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా సెంటిమెంటే ఆయుధం. కానీ ఈసారి ఆ చాన్స్ పూర్తిగా లేదు. చంద్రబాబు రాజకీయాల వల్ల మళ్లీ ఓ అవకాశం వచ్చింది. కానీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పలేం. 2014 ఎన్నికల సమయం నాటికి […]
2014 ఎన్నికలు వేరు. ఇప్పుడు జరుగుతున్నఎన్నికలు వేరు. తెలంగాణ తెచ్చిన ఘనతతో కేసీఆర్‌కు జనం పట్టం కట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నాలుగేళ్ల పరిపాలనపై జనం తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా సెంటిమెంటే ఆయుధం. కానీ ఈసారి ఆ చాన్స్ పూర్తిగా లేదు. చంద్రబాబు రాజకీయాల వల్ల మళ్లీ ఓ అవకాశం వచ్చింది. కానీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పలేం.
2014 ఎన్నికల సమయం నాటికి టీఆర్ఎస్‌కి ఓటు బ్యాంక్ లేదు. సెంటిమెంటే ఓటు బ్యాంక్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గులాబీ దళానికి బాసటగా నిలిచే వర్గాలు లేకుండా పోయాయి. పటిష్ట ఓటు బ్యాంక్ తయారుచేసుకునేందుకు టీఆర్ఎస్ కూడా చిన్నచిన్న ప్రయత్నాలే చేసింది. టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా బీసీలను తమ పార్టీకి ఓటు బ్యాంక్‌గా మార్చుకోవాలనే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలే టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ వర్గాలను ముందుకు తీసుకురాబోతున్నాయి.
ఈ ఓటుబ్యాంక్ పాలిటిక్స్ పక్కన పెట్టి చూస్తే…ఈ నాలుగున్నరేళ్ల కాలంలో 450కి పైగా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మొత్తం ఓట్లు 2 కోట్ల, 80 లక్షలకి పైగా ఉంటే… గులాబీ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు దాదాపు కోటిన్నరకు పైగానే ఉంటారని ఆ పార్టీ అంచనా.
ఇందులో రైతులు 50 లక్షలు. ఉద్యోగ, కార్మిక వర్గాలు ఇతర వర్గాలు కోటి ఉంటారని ఓ లెక్క. వీరందరినీ తమ వైపు తిప్పుకొని…. ఓటు వేసేలా చేస్తే తమకు తిరుగు ఉండదని గులాబీ నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. తమ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందారు…. మీకు ఫించన్ ఇచ్చాం…. కాబట్టి తమకు ఓటు వేయాలని లబ్ధిదారులకు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గులాబీ బాస్ తమకు వందకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు తమ వైపు ఉన్నారని…. అర్బన్ ప్రాంతాల్లో వారిని కూడా టీఆర్ ఎస్ వైపు తిప్పు కుంటే తమకు తిరుగు ఉండదని కేసీఆర్ నేతలకు చెప్పారట. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల కన్నా సెమీ అర్బన్ ప్రాంతాలు ఎక్కువ. మరీ ఈ సారి కేసీఆర్ ప్రయోగిస్తున్న సంక్షేమ సెంటిమెంట్ ఏ మేరకు వర్క్‌వుట్ అవుతుందో చూడాలి.