తీన్మార్ టీ-20 సిరీస్ లో నేడే తొలివార్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇక హోరాహోరీ విండీస్ పై గత నాలుగు టీ-20ల్లోనూ గెలుపులేని టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా యువసేన బ్రాత్ వెయిట్ నాయకత్వంలో ఆల్ రౌండ్ పవర్ తో విండీస్ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో…అసలు సమరానికి …భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ సిరీస్ లోని తొలి ఫైట్ కు… రోహిత్ శర్మ నాయకత్వంలోని మెన్ ఇన్ బ్లూ, కార్లోస్ బ్రాత్ […]

Advertisement
Update:2018-11-04 01:50 IST
  • ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇక హోరాహోరీ
  • విండీస్ పై గత నాలుగు టీ-20ల్లోనూ గెలుపులేని టీమిండియా
  • రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా యువసేన
  • బ్రాత్ వెయిట్ నాయకత్వంలో ఆల్ రౌండ్ పవర్ తో విండీస్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో…అసలు సమరానికి …భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ సిరీస్ లోని తొలి ఫైట్ కు… రోహిత్ శర్మ నాయకత్వంలోని మెన్ ఇన్ బ్లూ, కార్లోస్ బ్రాత్ వెయిట్ కెప్టెన్సీలోని కరీబియన్ ఆర్మీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. సూపర్ సండే ఫైట్ గా ఈమ్యాచ్ ప్రారంభమవుతుంది.

టీమిండియాతో టెస్ట్, వన్డే సిరీస్ ల్లో పరాజయాలు పొందిన విండీస్…ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలి సమరానికి భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో రంగం సిద్ధమయ్యింది.

టీమిండియా 2వ ర్యాంక్- విండీస్ 7వ ర్యాంక్

ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం…ఆతిథ్య టీమిండియా రెండో ర్యాంక్ లో ఉంటే…ప్రపంచ చాంపియన్ విండీస్ మాత్రం ఏడో ర్యాంక్ లో కొనసాగుతోంది. అంతేకాదు…ప్రస్తుత సిరీస్ లో… ఈ రెండుజట్లు…కెప్టెన్సీ మార్పుతో సమరానికి సిద్ధమయ్యాయి.

విరాట్ కొహ్లీకి మరోసారి విశ్రాంతి ఇవ్వడంతో…భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు చేపడితే….విండీస్ టీమ్ కు టీ-20 స్పెషలిస్ట్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వం వహిస్తున్నాడు.

ర్యాంకింగ్స్ లో టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నా…ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో మాత్రం కరీబియన్ టీమ్ దే పైచేయిగా ఉంది.

విండీస్ 5- టీమిండియా 2

2009 నుంచి 2017 వరకూ ఈ రెండుజట్లూ…మొత్తం ఎనిమిదిసార్లు తలపడితే…విండీస్ ఐదు విజయాలు, టీమిండియా రెండు విజయాల రికార్డుతో ఉన్నాయి.

అంతేకాదు…ఈ రెండుజట్ల తలపడిన గత నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో టీమిండియాకు ఒక్క గెలుపులేదంటే…కరీబియన్ పవర్ ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.

విండీస్ ప్రత్యర్థిగా టీమిండియా 2014 ప్రపంచకప్ లో మాత్రమే చివరిసారిగా విజయం సాధించింది.

విండీస్ కు ఆల్ రౌండ్ పవర్

జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ కెప్టెన్సీలోని కరీబియన్ టీమ్ లో డారెన్ బ్రావో, సూపర్ ఆల్ రౌండర్లు యాండ్రే రస్సెల్, కిరాన్ పోలార్డ్ లాంటి మొనగాళ్లున్నారు.

తమదైన రోజున మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో తారుమారు చేసే సత్తా ఈ ఆల్ రౌండర్లకే సొంతం.

కుర్రాళ్ల పైనే టీమిండియా భారం

మరోవైపు…విరాట్ కొహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి సీనియర్ స్టార్లకు విశ్రాంతి ఇవ్వడంతో…భారమంతా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, మనీశ్ పాండే , రిషభ్ పంత్ లాంటి యువఆటగాళ్ల పైన పడింది.

ఒక్కమాటలో చెప్పాలంటే….ఈ సిరీస్ టీమిండియా నవతరం ఆటగాళ్ల సత్తాకు సవాల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2014 తర్వాత…విండీస్ పై టీమిండియా టీ-20ల్లో తొలి విజయం సాధిస్తుందో? లేదో ? తెలుసుకోవాలంటే….మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

ఈ సూపర్ డూపర్ సండే ఫైట్ కోసం…దేశంలోని కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News