ఏటీపీ వందో టైటిల్ కు ఫెదరర్ గురి

ఎవర్ గ్రీన్ స్విస్ స్టార్ టాప్ గేర్ స్విస్ వండర్, పురుషుల టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్…తన కెరియర్ లో వందో టైటిల్ కు గురిపెట్టాడు. గత వారం ముగిసిన బాసెల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా 99వ సింగిల్స్ ట్రోఫీ అందుకొన్న 37 ఏళ్ల ఫెదరర్… వందో టైటిల్ తో సెంచరీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. పారిస్ వేదికగా ప్రారంభమైన పారిస్ మాస్టర్స్ టోర్నీ బరిలోకి దిగాడు. తొలిరౌండ్లో ఇటలీ ఆటగాడు ఫాబియా […]

Advertisement
Update:2018-11-02 16:50 IST
  • ఎవర్ గ్రీన్ స్విస్ స్టార్ టాప్ గేర్

స్విస్ వండర్, పురుషుల టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్…తన కెరియర్ లో వందో టైటిల్ కు గురిపెట్టాడు. గత వారం ముగిసిన బాసెల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా 99వ సింగిల్స్ ట్రోఫీ అందుకొన్న 37 ఏళ్ల ఫెదరర్… వందో టైటిల్ తో సెంచరీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

పారిస్ వేదికగా ప్రారంభమైన పారిస్ మాస్టర్స్ టోర్నీ బరిలోకి దిగాడు. తొలిరౌండ్లో ఇటలీ ఆటగాడు ఫాబియా ఫాగ్నినీని 6-4, 6-3తో చిత్తు చేసి వందో టైటిల్ వేట మొదలు పెట్టాడు.

రెండోరౌండ్లో జపాన్ స్టార్ ప్లేయర్ నిషికోరీతో ఫెదరర్ ఢీ కోనున్నాడు. 15 ఏళ్ల విరామం తర్వాత… పారిస్ మాస్టర్స్ బరిలోకి దిగిన ఫెదరర్ మరో మూడు విజయాలు సాధించగలిగితే… కెరియర్ లో వందో టైటిల్ సాధించే అవకాశం ఉంది. అయితే ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, రెండో ర్యాంకర్ రాఫెల్ నడాల్ లాంటి గట్టి ప్రత్యర్థులను అధిగమించాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News