రోహిత్ శర్మ రికార్డుల అడ్డా బ్రబోర్న్ స్టేడియం!

గత ఆరుసీజన్లుగా తిరుగులేని రోహిత్ శర్మ 2013 నుంచి సీజన్ కో టాప్ స్కోరుతో రోహిత్ సూపర్ హిట్ భారత క్రికెట్ ప్రధాన కేంద్రం ముంబై మహానగరంలో…. బ్రబోర్న్ స్టేడియం, వాంఖెడీ స్టేడియం పేర్లతో రెండు అంతర్జాతీయ క్రికెట్ వేదికలు ఉన్నాయి. ముంబై క్రికెట్ సంఘం ప్రధాన వేదికలుగా ఉన్న… ఈ రెండు వేదికల్లోనూ సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లతో పాటు…అంతర్జాతీయ మ్యాచ్ లను సైతం నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు…వాస్తవానికి వాంఖెడీ స్టేడియం వేదికగా జరగాల్సిన విండీస్ నాలుగో […]

Advertisement
Update:2018-10-31 02:44 IST
  • గత ఆరుసీజన్లుగా తిరుగులేని రోహిత్ శర్మ
  • 2013 నుంచి సీజన్ కో టాప్ స్కోరుతో రోహిత్ సూపర్ హిట్

భారత క్రికెట్ ప్రధాన కేంద్రం ముంబై మహానగరంలో…. బ్రబోర్న్ స్టేడియం, వాంఖెడీ స్టేడియం పేర్లతో రెండు అంతర్జాతీయ క్రికెట్ వేదికలు ఉన్నాయి. ముంబై క్రికెట్ సంఘం ప్రధాన వేదికలుగా ఉన్న… ఈ రెండు వేదికల్లోనూ సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లతో పాటు…అంతర్జాతీయ మ్యాచ్ లను సైతం నిర్వహిస్తూ వస్తున్నారు.

అంతేకాదు…వాస్తవానికి వాంఖెడీ స్టేడియం వేదికగా జరగాల్సిన విండీస్ నాలుగో వన్డే మ్యాచ్ ను…ముంబైలోని మరో స్టేడియం బ్రబోర్న్ వేదికగా నిర్వహించారు. అయితే…ఈ మ్యాచ్ ద్వారా.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ…తన పరుగుల అడ్డా బ్రబోర్న్ స్టేడియం మాత్రమేనని చాటుకొన్నాడు.

బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఆడిన అన్నిరకాల ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే. బ్రబోర్న్ వేదికగా గుజరాత్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో… రోహిత్ శర్మ కేవలం 45 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 13 బౌండ్రీలతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు.

అంతేకాదు..2009-10 రంజీ సీజన్లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సైతం రోహిత్ శర్మ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అంతటితో ఆగిపోకుండా…వెస్టిండీస్ తో ముగిసిన నాలుగో వన్డేలో 162 పరుగుల భారీస్కోరుతో చెలరేగిపోయాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ తో మహ్మద్ అజరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ తో విరాట్ కొహ్లీకి, న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంతో అనీల్ కుంబ్లేకి ఎలాంటి అనుబంధం ఉందో….ముంబై బ్రబోర్న్ స్టేడియంతో తనకూ అలాంటి అనుబంధమే ఉందని….రోహిత్ శర్మ చాటుకొన్నాడు.

2013 నుంచి రోహిత్ శర్మ షో…..

భారత వన్డే క్రికెట్లో….2013 సీజన్ నుంచి రోహిత్ శర్మ హవా కొనసాగుతోంది. వన్డే క్రికెట్ గత ఆరు సీజన్లుగా…అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు.

2013లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 209 పరుగుల భారీ స్కోరు సాధించాడు.

2014 సీజన్లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్ లో…264 పరుగుల అత్యధిక స్కోరుతో ఏకంగా ప్రపంచరికార్డే నెలకొల్పాడు.

2015 సీజన్లో కాన్పూర్ గ్రీన్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 150 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

2016 సీజన్లో పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్ లో 171 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

2017 సీజన్లో మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 208 నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

ప్రస్తుత 2018 సీజన్లో సైతం రోహిత్ శర్మే 162 పరుగుల టాప్ స్కోరు సాధించాడు. వెస్టిండీస్ తో ముగిసిన నాలుగో వన్డేలో…రోహిత్ శర్మ….కేవలం 98 బాల్స్ లోనే 13 బౌండ్రీలు, ఓ భారీ సిక్సర్ తో సెంచరీ మార్క్ చేరాడు. …ఆ తర్వాత రోహిత్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు.

అంబటి రాయుడుతో కలసి మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరకు 137 బాల్స్ లో 20 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 162 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

వన్డే క్రికెట్లో…150కి పైగా స్కోర్లు సాధించడం…సూపర్ హిట్టర్ రోహిత్ శర్మకు ఇది ఏడవసారి. ప్రస్తుత సిరీస్ లో భాగంగా గౌహతీలో ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల స్కోరు సాధించిన రోహిత్…ముంబై వన్డేలో 162 పరుగులు సాధించడం విశేషం. ప్రస్తుత నాలుగో వన్డే వరకూ ఆడిన 192 మ్యాచ్ ల్లో…21 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 7వేల 300కు పైగా పరుగులు సాధించాడు.

Tags:    
Advertisement

Similar News