యరపతినేని వియ్యంకుడిపై ఐటీ దాడులు
నాలుగున్నరేళ్లుగా స్వేచ్చగా ఇష్టమొచ్చిన రీతిలో వ్యాపారాలు కొనసాగించిన టీడీపీ నేతలు, వారి బంధువులు ఇప్పుడు ఐటీ దాడుల దెబ్బకు వణుకుతున్నారు. చంద్రబాబు అండ ఉండగా తాము ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన పనిలేదన్నట్టు టీడీపీ నేతల కంపెనీలు రెచ్చిపోయాయి. అయితే చంద్రబాబు బినామీలుగా పేరున్న వారి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బంధువుల వరకు ఐటీ వెంటాడుతోంది. తాజాగా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వియ్యంకుడి ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. యరపతినేని వియ్యంకుడు హరిబాబు నడుపుతున్న పేరం […]
నాలుగున్నరేళ్లుగా స్వేచ్చగా ఇష్టమొచ్చిన రీతిలో వ్యాపారాలు కొనసాగించిన టీడీపీ నేతలు, వారి బంధువులు ఇప్పుడు ఐటీ దాడుల దెబ్బకు వణుకుతున్నారు. చంద్రబాబు అండ ఉండగా తాము ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన పనిలేదన్నట్టు టీడీపీ నేతల కంపెనీలు రెచ్చిపోయాయి. అయితే చంద్రబాబు బినామీలుగా పేరున్న వారి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బంధువుల వరకు ఐటీ వెంటాడుతోంది.
తాజాగా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వియ్యంకుడి ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. యరపతినేని వియ్యంకుడు హరిబాబు నడుపుతున్న పేరం గ్రూప్‌పై ఈ దాడులు జరుగుతున్నాయి. తిరుపతి, హైదరాబాద్, విశాఖలో ఇళ్లు, ఆఫీస్‌లపై ఐటీ అధికారులు ఉదయం ఏడు గంటల నుంచి సోదాలు చేస్తున్నారు.
గురజాల ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు ఇటీవల మైనింగ్‌లో పన్నులు ఎగ్గొటి వేల కోట్ల రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టులో విచారణ కూడా సాగుతోంది. ఈనేపథ్యంలో యరపతినేని వియ్యంకుడిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. దాడుల్లో పలు కీలక విషయాలను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.