నిందితుడి కులం పేరు డీజీపీ ఎందుకు చెప్పారు? " విజయసాయిరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఏపీ డీజీపీ ఠాకూర్, క్యాంటీన్ యజమాని హర్షవర్థన్ చౌదరి, సినిమా బ్రోకర్ శివాజీ కలిసి జగన్ హత్యకు కుట్ర పన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో పార్టీ నేతలు మేకపాటి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, వరప్రసాద్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి… ఘటన జరిగిన తర్వాత డీజీపీ, ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. దాడి 12. 38 నిమిషాలకు జరిగితే రెండు […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఏపీ డీజీపీ ఠాకూర్, క్యాంటీన్ యజమాని హర్షవర్థన్ చౌదరి, సినిమా బ్రోకర్ శివాజీ కలిసి జగన్ హత్యకు కుట్ర పన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఢిల్లీలో పార్టీ నేతలు మేకపాటి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, వరప్రసాద్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి… ఘటన జరిగిన తర్వాత డీజీపీ, ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు.
దాడి 12. 38 నిమిషాలకు జరిగితే రెండు గంటలకు డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి దాడి చేసింది జగన్ అభిమానేనని ప్రకటించారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా దాడి చేసిన శ్రీనివాసరావు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. దాడి చేసిన వ్యక్తి కులాన్ని ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ఇలా ఒక నిందితుడు కులాన్ని ప్రకటించడం చట్ట విరుద్దమని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. తర్వాత మీడియా ముందుకొచ్చిన చంద్రబాబు… జగన్‌పై దాడిని ఖండించిన వారిని తప్పుపట్టడం బట్టే జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నది స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. దాడిని ఖండించిన టీఆర్‌ఎస్, జనసేన, బీజేపీ నేతలను కుట్రలో భాగమని ఆరోపించడం చంద్రబాబు విజ్ఞతకు అద్దంపడుతోందన్నారు.
గతంలో అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరసనగా ధర్నా చేశారని గుర్తు చేశారు. వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా అదేనన్నారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పడం లేదని…. కానీ చంద్రబాబు కనుసన్నల్లో పోలీసు అధికారులు పనిచేస్తున్నందునే జగన్‌పై దాడి కేసులో థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నామన్నారు.