దశమి రోజున మూడు పార్టీల జాబితాలు !
మహకూటమి అభ్యర్థుల జాబితాకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 2న దశమి రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు నవంబర్ 1న తొలి జాబితా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే 1న నవమి వస్తుందని… ముహూర్తం బాగా లేదని కొందరు నాయకులు అభ్యంతరం చెప్పడంతో రెండో తేదీకి షిప్ట్ చేశారు. దశమి రోజు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. […]
మహకూటమి అభ్యర్థుల జాబితాకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 2న దశమి రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు నవంబర్ 1న తొలి జాబితా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే 1న నవమి వస్తుందని… ముహూర్తం బాగా లేదని కొందరు నాయకులు అభ్యంతరం చెప్పడంతో రెండో తేదీకి షిప్ట్ చేశారు. దశమి రోజు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే 105 ఒకసారి, మరో రెండు సీట్లను మరో సారి ప్రకటించి, అభ్యర్ధుల ప్రకటనలో ముందంజలో ఉన్న టి.ఆర్.ఎస్. ఇక కేవలం 12 నియోజక వర్గాలకు సంబంధించిన అభ్యర్ధుల్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. దశమి రోజున తమ అభ్యర్ధుల తుది జాబితాని కూడా ప్రకటించి టిక్కెట్ల కేటాయింపుని పూర్తి చేసిన మొదటి పార్టీగా ముందజలోనే ఉండాలని టి.ఆర్.ఎస్. కూడా భావిస్తోందని సమాచారం.
ఇటు బీజేపీ కూడా మరో 40 మంది లిస్ట్ విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది, ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేసి ఆమోదానికి పంపింది. ఈ లిస్ట్ కూడా దశమి రోజు నవంబర్2న విడుదల అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈలోపు తొలి జాబితాను విడుదల చేయాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నవంబర్ తొలి వారంలో తెలంగాణ ఎన్నికల కోలాహలం పీక్ స్టేజీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.