శ్రీనివాస్ రాజభోగం.... బిర్యానీ లాగించి.... కాసేపు కునుకు తీసి....

జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాసరావు చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. పోలీసుల విచారణ సందర్భంగా ఏమాత్రం భయం లేకుండా దర్జాగా వ్యవహరిస్తున్నాడు. ఏం అడిగినా లేఖలో అంతా రాశాను గా… చెప్పడానికి ఏమీ లేదంటూ బుకాయిస్తున్నాడు. పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినా తన దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.. అంతా లేఖలో ఉంది చదువుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. తనను ఈ కేసు ఏమీ చేయలేదన్నట్టుగా అతడు వ్యవహరిస్తున్నాడు. శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చిన క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ […]

Advertisement
Update:2018-10-29 04:20 IST

జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాసరావు చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. పోలీసుల విచారణ సందర్భంగా ఏమాత్రం భయం లేకుండా దర్జాగా వ్యవహరిస్తున్నాడు. ఏం అడిగినా లేఖలో అంతా రాశాను గా… చెప్పడానికి ఏమీ లేదంటూ బుకాయిస్తున్నాడు.

పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినా తన దగ్గర కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.. అంతా లేఖలో ఉంది చదువుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. తనను ఈ కేసు ఏమీ చేయలేదన్నట్టుగా అతడు వ్యవహరిస్తున్నాడు. శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చిన క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి కూడా అంతే ధీమాగా ఉన్నాడు.

పోలీసుల విచారణకు వచ్చిన ఆయన పోలీసుల ముందే కుర్చీపై స్టైల్‌గా కూర్చుని తను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావుకు మర్యాదలు కూడా తగ్గడం లేదు. ఒక దఫా విచారణ పూర్తికాగానే పోలీసులు శ్రీనివాసరావును ఏం తింటావ్ అని కోరారు. అందుకు చికెన్ బిర్యానీ తీసుకురావాల్సిందిగా పోలీసులకు శ్రీనివాసరావు సూచించాడు. దాంతో పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని హోటల్‌ నుంచి చికెన్ బిర్యానీ తెచ్చి పోలీసులు ఇచ్చారు.

దాన్ని ఏమాత్రం వదలకుండా ఫుల్‌గా లాగించేశాడు శ్రీనివాసరావు. కాసేపు సెల్‌లోనే కునుకు తీశాడు. మరోవైపు కేసుకు సంబంధించి పోలీసుల్లో కొందరు లీక్‌లు ఇస్తారని ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్‌లకు భయం పట్టుకుంది. అందుకే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు, సిబ్బంది ఫోన్లు అన్ని స్వీచ్చాఫ్ చేయించారు. మీడియాతో అస్సలు మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.

Tags:    
Advertisement

Similar News